Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఏపీలో 63 వేల ఉద్యోగాలు.. వార్షిక క్యాలెండర్ ఎప్పుడంటే?

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 63 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉద్యోగాల సంఖ్య మరో 10 – 15 వేలు పెరిగే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీ క్యాలెండర్‌కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జ‌న‌వ‌రి 31న‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరగాలని ఆయన సూచించారు. ఫిబ్రవరి 3 వారంలో జరిగే సమావేశం నాటికి.. ఖాళీల పూర్తి వివరాలతో వస్తామని అధికారులు చెప్పగా సీఎం అంగీకరించారు.

మార్చిలో ఉద్యోగ క్యాలెండర్..
మొత్తం ఖాళీల భర్తీలో ఏపీపీఎస్సీ ద్వారా 19,000 ఉద్యోగాలను భర్తీ చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మిగతా పోస్టుల్లో.. డీఎస్సీ ద్వారా 21 వేల టీచర్ పోస్టులు, ఇతర ఉద్యోగాల భర్తీ జరిగే అవకాశమున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు పోలీసుశాఖలో 13 వేలు ఖాళీలున్నట్లు అధికారులు గుర్తించారు. మార్చిలో ఉద్యోగ క్యాలెండర్ వెలువడే అవకాశం ఉందని అధికారవర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *