జేఈఈ (మెయిన్) ఏప్రిల్ – 2020 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 7న ప్రారంభమైంది. విద్యార్థులు ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏప్రిల్ 5, 7, 9, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 30న ఫలితాలను వెల్లడించనున్నారు
దేశవ్యాప్తంగా జనవరి 6 నుంచి 9వ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలను ఎన్టీఏ నిర్వహించింది. వీటికి సంబంధించిన ‘కీ’ని జనవరి 14న విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ అనంతరం జనవరి 17న ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీని కూడా ఎన్టీఏ విడుదల చేసింది. అభ్యర్థుల మార్కులను మాత్రమే ఎన్టీఏ వెల్లడించింది. ఏప్రిల్ సెషన్ పరీక్షల అనంతరం ర్యాంకులను కేటాయిస్తారు.
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత.
వయసు: ఎలాంటి వయోపరిమితి లేదు.
దరఖాస్తు ఫీజు..
✪ బీఈ/బీటెక్ (లేదా) బీఆర్క్ (లేదా) బీప్లానింగ్ పరీక్షకు దరఖాస్తు చేసేవారు (ఏదైనా ఒక పేపర్)..
కేటగిరీ | ఇండియా | ఇండియా వెలుపల |
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ | బాలురు-రూ.650 బాలికలు-రూ.325 |
బాలురు-రూ.3000 బాలికలు-రూ.1500 |
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ట్రాన్స్జెండర్ | బాలురు-రూ.325 బాలికలు-రూ.325 |
బాలురు-రూ.1500 బాలికలు-రూ.1500 |
✪ బీఈ/బీటెక్, బీఆర్క్ (లేదా) బీఈ/బీటెక్, బీప్లానింగ్ (లేదా) బీఈ/బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ (లేదా) బీఆర్క్, బీప్లానింగ్ (ఒకటి కంటే ఎక్కువ పేపర్లు రాసేవారు)..
కేటగిరీ | ఇండియా | ఇండియా వెలుపల |
జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ | బాలురు-రూ.1300 బాలికలు-రూ.650 |
బాలురు-రూ.6000 బాలికలు-రూ.3000 |
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ట్రాన్స్జెండర్ | బాలురు-రూ.650 బాలికలు-రూ.650 |
బాలురు-రూ.3000 బాలికలు-రూ.3000 |
పరీక్ష విధానం..
.