భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని రైట్స్ లిమిటెడ్-గురుగ్రామ్ కాంట్రాక్ట్ విధానంలో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు..
* ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్: 170 పోస్టులు
విభాగాలవారీగా ఖాళీలు..
ఇంజినీర్ (సివిల్): 50
ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 30
ఇంజినీర్ (మెకానికల్): 90
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణత, అనుభవం.
అనుభవం: సంబంధిత విభాగాల్లో కనీసం 2 సంవత్సరాలు.
వయోపరిమితి: 01.11.2020 నాటికి 40 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ఎంపిక విధానం: అనుభవం, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు..
* ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 05.11.2020.
* ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 26.11.2020.