Latest News Uncategorized బిజినెస్ న్యూస్

EPF: ఈపీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్..

చందాదారులకు దీపావళి పండుగ బొనాంజను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ప్రకటించింది. తొలి విడత 8.5 శాతం వడ్డీని దీపావళి పండగకు తన చందాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్ ద్వారా నిర్వహించిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

2019-20 సంవత్సరానికి ఈపీఎఫ్ పై 8.5 శాతం వడ్డీని క్రెడిట్ చేయనున్నారు. మిగిలిన 0.35 శాతం వడ్డీ రేటు ఈ ఏడాది డిసెంబర్‌లో చందాదారుల ఖాతాలో జమ అవుతుందని బోర్డు తెలిపింది.

“కొవిడ్ -19 కారణంగా ఉత్పన్నమయ్యే అసాధారణమైన పరిస్థితుల దృష్ట్యా వడ్డీ రేటుకు సంబంధించిన ఎజెండాను కేంద్ర బోర్డు సమీక్షించింది. అదే రేటును 8.50 శాతం వద్ద కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రుణ ఆదాయం నుంచి 8.15 శాతం, ఈటీఎఫ్‌ల అమ్మకం నుంచి బ్యాలెన్స్ 0.35 శాతం (మూలధన లాభం) 2020 డిసెంబర్ 31 నాటికి వాటి విముక్తికి లోబడి ఉంటుంది” అని ఈపీఎఫ్‌ఓ తెలిపింది.

2019-20 ఆర్థిక సంవత్సరపు ఆదాయంలో అటువంటి మూలధన లాభాలను అసాధారణమైన కేసుగా పరిగణించాలని బోర్డు సిఫార్సు చేసింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మార్చిలో రిటైర్మెంట్ ఫండ్ బాడీ యొక్క ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

బ్యాలెన్స్ ఇలా చూసుకోండి..
ఈపీఎఫ్‌ ఖాతాలో నిల్వలను తనిఖీ చేయడానికి యూఏఎన్‌ నంబర్‌ను ఆధార్, పాన్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. ఈపీఎఫ్‌ఓహెచ్‌వో యూఏఎన్‌ ఈఎన్‌జీ అని టైప్ చేసి 7738299899 కు పంపాల్సి ఉంటుంది.

చివరి మూడు అక్షరాలు ‘ENG’ వినియోగదారు ఇష్టపడే భాష. చందాదారులు ఏ భాషలోనైనా సందేశాన్ని అందుకునే వీలు కల్పించారు. మీ భాష యొక్క మొదటి 3 అక్షరాలను టైప్ చేయాలి.

ఉదాహరణకు బెంగాలీ అయితే బీఈఎన్‌, మరాఠీ కోసం ఎంఏఆర్‌ అని టైప్‌ చేయాలి. ఇంగ్లిష్, మరాఠీ, బెంగాలీ, హిందీ, గుజరాతీ, పంజాబీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లో ఎస్ఎంఎస్ సౌకర్యం అందుబాటులో ఉంది.


మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *