Latest News Uncategorized టెక్నాలజీ బిజినెస్ న్యూస్

Diwali Offer: రూ.101కే స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!

పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్‌ కంపెనీలు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించడం కామనే. ఈ క్రమంలోనే రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా స్మార్ట్‌ఫోన్‌ తయారీదారు వివో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.

Also Read: SBI కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. తక్కువ వడ్డీకే రుణం!

పండుగ సందర్భంగా వీ 20ఎస్‌, వీ 20, ఎక్స్‌ 50 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లను 101 రూపాయలకే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. అలాగే ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు , బ్యాంక్ ఆఫ్‌బరోడాల కార్డు కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

Also Read: Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి పైకి!

దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి అంటూ వివో తాజాగా ట్వీట్‌ చేసింది. కేవలం రూ. 101 చెల్లించి మీ రెంతో ఇష్టపడే వివో ఫోన్‌ను సొంతం చేసుకోండి. దీంతోపాటు అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండని పేర్కొంది.

Also Read: Micromax కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. ధర ఎంతంటే?

అయితే ఎప్పటినుంచి ఎప్పటివరకు ఈ ఆఫర్ అందుబాటులోఉండనుందీ స్పష్టత ఇవ్వలేదు. ఈ ఆఫర్‌ ప్రకారం మొదట 101 రూపాయల డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అనంతరం ఫోన్‌ విలువ మొత్తాన్ని ఎంపికచేసిన సులభ ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *