Uncategorized

Gold Price: పెరిగిన బంగారం ధర.. వెండి భారీ పతనం

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) గత వారం రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు మాత్రం భారీగా దిగొచ్చాయి.

హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధర (Gold Price Today In Hyderabad) రూ.640 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,020కు చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.580 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,600 అయింది.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Price in Delhi) పెరుగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.210 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.55,250 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,650 వద్ద ట్రేడ్ అవుతోంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) భారీగా దిగొచ్చాయి. దీంతో కేజీ వెండి ధర రూ.65 వేల నుంచి రూ.61 వేలకు పతనమైంది. తాజాగా వెండి ధర రూ.4,400 మేర భారీగా దిగొచ్చింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,000కి క్షీణించింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *