Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

గత వారం రోజులుగా బులియన్ మార్కెట్‌లో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా దిగొచ్చాయి. దేశరాజధాని ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,650 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.53,600 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 తగ్గడంతో ధర రూ.49,150కి వద్ద కొనసాగుతోంది.

Also Read: BEL Jobs: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు (చివ‌రితేది: 25.11.2020)


తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే..

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడలో బంగారం ధర భారీగానే దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.1,640 తగ్గి.. రూ.51,380 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,500 తగ్గి.. రూ.47,100 వద్ద నిలిచింది.

Also Read: Army School Jobs: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు(చివ‌రి తేది: 15.11.2020)

బంగారం బాటలోనే వెండి..
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో.. వెండి ధర రూ.3,500 మేర పతనమైంది. దీంతో బులియన్ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,900 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా వెండి ధర ఒకే విధంగా ఉంది.

Also Read: Diwali Offer: రూ.101కే స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!

అంతర్జాతీయంగా ఇలా..
దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పతనం కాగా.. అంతర్జాతీయంగా మాత్రం మిశ్రమంగా కదిలాయి. బంగారం ధర పైకి కదలగా.. వెండి ధర మాత్రం క్షీణించింది. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 1878 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర ఔన్స్‌కు 0.42 తగ్గి 24.36 డాలర్లకు పతనమైంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *