Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..

బులియన్ మార్కెట్‌లో గత వారం రోజులుగా వరుసగా పెరిగిన బంగారం ధరలు నవంబరు 11న దిగొచ్చిన సంగతి తెలిసింది. అయితే నవంబరు 12న బంగారం ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధరలు సైతం పసిడి దారిలోనే పయనించాయి.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.. హైదరాబాద్‌‌ బంగారం ధర రూ.110 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,490కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.47,200కు పైకి ఎగసింది. విశాఖపట్నం, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ మార్కెట్‌లోనూ గత వారం పెరిగిన బంగారం ధరలు నిన్న దిగొచ్చాయి. తాజాగా బంగారం ధరలు ఢిల్లీలో యథాతథంగా కొనసాగుతున్నాయి. తాజాగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,610 వద్ద మార్కెట్ అవుతోంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,160గా కొనసాగుతోంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) భారీగా పెరిగాయి. గత ట్రేడింగ్‌లో రూ.3,500 మేర పతనమైన వెండి ధర.. తాజాగా రూ.900 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.62,800కి వద్ద నిలిచింది. దేశవ్యాప్తంగా వెండి ధరలు ఒకే విధంగా ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.06 శాతం తగ్గుదలతో 1860 డాలర్లకు క్షీణించగా… వెండి ధర ఔన్స్‌కు 0.02 క్షీణించి 24.20 డాలర్లకు చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *