Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate Today: బంగారం కిందకి.. వెండి మరింతపైకి!

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు బుధవారం (నవంబరు 3) దిగిరాగా.. ఢిల్లీలో మాత్రం పెరిగాయి. మరోవైపు గత ట్రేడింగ్‌లో భారీగా పెరిగిన వెండి ధరలు మరింత పెరిగాయి.

హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.370 మేర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,550కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,250కి దిగొచ్చింది.

ఢిల్లీలో పెరుగుదల..
ఢిల్లీ మార్కెట్‌లో ఇటీవల వరుసగా దిగొచ్చిన బంగారం ధరలు తాజాగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.52,780కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,300కి పెరిగింది.

వెండి పైకి..
బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం దూసుకెళ్లింది. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో.. కిలో వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో వెండి ధర కిలోకు రూ.67,000 వద్ద కొనసాగుతోంది.

గ్లోబల్ ‘షైన్’..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పరుగులు పెట్టాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరిగి 1912 డాలర్లకు చేరగా.. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరిగి 24.42 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *