Latest News Uncategorized బిజినెస్ న్యూస్

మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate: దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అంతర్జాతీయ పరిణామాలతో గత ట్రేడింగ్‌లో తగ్గిన బంగారం ధర గురువారం (నవంబరు 5) భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పతనమైంది.

ఢిల్లీలో పైకే..
దేశరాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఇటీవల బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా పెరుగుతున్నాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై ఏకంగా రూ.1,370 మేర పెరగడంతో 10 గ్రాముల ధర రూ.54,150కి చేరింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.350 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.49,650కి పుంజుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 పెరిగి రూ.47,600కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.370 పెరిగి రూ.51,920 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వెండి ఢమాల్..
ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. వెండి ధర (Silver Rates in Hyderabad) మాత్రం భారీగా పతనమైంది. పారిశ్రామికవర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.700 దిగొచ్చింది. దీంతో వెండి ధర కిలోకు రూ.66,300 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు దేశవ్యాప్తంగా ఒకే విధంగా కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయంగా పరుగులే..
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి, వెండి ధరలు పరుగులు పెట్టాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం పెరిగి 1905 డాలర్లకు చేరగా.. వెండి ధర ఔన్స్‌కు 0.61 శాతం పెరుగుదలతో 24.03 డాలర్ల వద్ద నిలిచింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *