బులియన్ మార్కెట్లో బంగారం ధరలు (Gold Rate Today) గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. శుక్రవారం (నవంబరు 6) బంగారం ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధరలు ఓ మోస్తరుగా పెరగ్గా.. వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.
హైదరాబాద్‌లో బంగారం ధర నిన్న రూ.370 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,920కి చేరింది నేడు అదే ధరలో ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600గా ఉంది. ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీ మార్కెట్లో ఇటీవల బంగారం ధరలు (Gold Rate in Delhi) వరుసగా పెరుగుతున్నాయి. అయితే శుక్రవారం మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడి మార్కెట్లతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,160 వద్ద ట్రేడ్ అవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,660 వద్ద కొనసాగుతోంది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా పెరిగింది. గత ట్రేడింగ్‌లో రూ.700 పతనమైన వెండి ధర.. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో శుక్రవారం రూ.300 పుంజుకుంది. దీంతో కిలో వెండి ధర రూ.66,600కు చేరింది.
బంగారం, వెండి ధరలు దేశీయంగా పెరగగా.. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం దిగొచ్చాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.24 శాతం తగ్గి 1942 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. వెండి ధర ఔన్స్‌కు 0.44 క్షీణించి 25.07 డాలర్లకు చేరింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..