Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: షాకిచ్చిన బంగారం.. భారీగా పతనమైన వెండి

గత ట్రేడింగ్‌లో కాస్త పెరిగిన బంగారం ధరలు శనివారం (నవంబరు 7) మరింత పెరిగాయి. ఒకవైపు బంగారం ధరలు పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పతనమైంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 పెరగడంతో.. రూ.50,050 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 పెరిగింది. దీంతో రూ.54,600 వద్ద నిలిచింది.

Diwali Offer: రూ.101కే స్మార్ట్‌ఫోన్‌.. త్వరపడండి!

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ శనివారం బంగారం ధరలు గత ట్రేడింగ్‌తో పోల్చితే.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 పెరిగి రూ.48,800 స్థాయికి చేరింది.

అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.430 పెరగడంతో.. రూ.52,360 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 13.11.2020)

భారీగా పతనమైన వెండి..
ఒకవైపు బంగారం ధరలు పెరుగుదల కనబరిస్తే.. వెండి ధరలు మాత్రం భారీగా దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కిలో వెండి ధర ఏకంగా రూ.2100 పతనమైంది. దీంతో వెండి ధర కిలోకు రూ.64,500 వద్ద ట్రేడ్ అవుతోంది.

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు (చివ‌రితేది: 25.11.2020)

అంతర్జాతీయంగా దూకుడే..
అంతర్జాతీయ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.27 శాతం పెరుగుదలతో 1952 డాలర్లకు చేరింది. ఇక వెండి ధర ఔన్స్‌కు 2.05 పెరుగుదలతో 25.70 డాలర్లకు చేరింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *