Latest News Uncategorized బిజినెస్ న్యూస్

షాకిచ్చిన బంగారం.. భారీగా పెరిగిన వెండి!

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. బంగారంతోపాటు వెండి సైతం పరుగులు పెడుతోంది. దేశరాజధాని ఢిల్లీలో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అక్కడ సోమవారం (నవంబరు 9) పసిడి ధరలు పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.440 మేర పెరిగి.. రూ.55,040 వద్ద నిలిచింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,460కి చేరింది.

Also Read: SSC CHSL 2020 నోటిఫికేషన్ విడుదల (చివరితేది: 15.12.2020)

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
హైదరాబాద్‌‌లలో బంగారం ధర రూ.440 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,380 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.410 పెరిగి రూ.48,020 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం, విజయవాడల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.830 పెరగగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.770 పెరిగింది.

Also Read: DIC Jobs: డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఖాళీలు (చివ‌రి తేది: 13.11.2020)

వెండి జంప్..
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు (Silver Rate in India) వరుసగా పెరుగుతున్నాయి. దీంతో కేజీ వెండి ధర రూ.65 వేల మార్కు చేరుకుంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.900 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.65,410 అయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది.

Also Read: BEL Jobs: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు (చివ‌రితేది: 25.11.2020)

అంతర్జాతీయంగా జోరు..
అంతర్జాతీయ మార్కెట్‌లో నవంబరు 9న బంగారం, వెండి ధరలు పైకి కదిలాయి. బంగారం ధర ఔన్స్‌కు 0.23 శాతం పెరిగి 1956 డాలర్లకు చేరగా.. వెండి ధర ఔన్స్‌కు 0.94 పెరిగి 25.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *