అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరల పతనం ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా పడింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి. దేశరాజధాని ఢిల్లీలో రూ.100 మేర బంగారం ధరలు పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,170 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,110 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..హైదరాబాద్ మార్కెట్లో సోమవారం (ఆగస్టు 17) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి.. రూ.55,650కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.110 తగ్గి రూ.51,000 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఒకపక్క బంగారం ధరలు తగ్గగా.. మరోవైపు వెండి ధర పైకి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో కిలో వెండి ధర రూ.1050 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.68,000 చేరింది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధర దిగొచ్చింది. వెండి ధర మాత్రం పెరిగింది. ఔన్స్ బంగారం ధర 0.33 శాతం తగ్గి..1943 డాలర్లకు చేరగా.. వెండి ధర ఔన్స్‌కు 0.21 శాతం పెరిగి 26.16 డాలర్ల వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..