దేశీయంగా బంగారం ధర బుధవారం (నవంబరు 3) స్వల్పంగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.111 పెరిగి రూ.50,743కు చేరింది.
Also Read: IBPS PO పీవో పోస్టులు.. దరఖాస్తుకు మరో ఛాన్స్!
ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కొద్దిగా తగ్గడమే బంగారం ధరలు స్వల్పంగా పెరగడానికి కారణమైందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు వెల్లడించారు. కాగా గత ట్రేడింగ్లో 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర రూ.50,632 వద్ద ముగిసింది.
Also Read: Gold Rate Today: బంగారం కిందకి.. వెండి మరింతపైకి!
ఇక ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1266 తగ్గి రూ.60,669 వద్ద ముగిసింది. గత ట్రేడ్లో కిలో వెండి ధర 61,935 వద్ద ముగిసింది. బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1895 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.60 అమెరికన్ డాలర్లు పలికింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..