దేశంలోని ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) తమ కస్టమర్లకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఎస్బీఐ తన ఖాతాదారులకు వివిధ రకాల లోన్స్‌ను తక్కువ వడ్డీలకే అందిస్తున్న విషయం తెలిసిందే. వీటిల్లో ఎమర్జెన్సీ పర్సనల్ లోన్స్ కూడా ఒక భాగంగానే చెప్పుకోవాలి. ఎస్బీఐ తక్కువ వడ్డీ రేటుకే రూ.5 లక్షల వరకు పర్సనల్ లోల్స్ అందిస్తోంది. ఇక, ఈ రుణాలను యోనో యాప్ ద్వారా కేవలం 45 నిమిషాల్లోనే పొందే అవకాశం కల్పించింది.
Also Read: మళ్లీ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
వివిధ రకాల లోన్స్‌పై వడ్డీ రేట్లను తక్కువగా వసూలు చేస్తోంది ఎస్బీఐ.. పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.5 శాతంగా ఉంది. ఇతర పర్సనల్ లోన్స్‌తో పోలిస్తే ఈ వడ్డీ రేటు చాలా తక్కువ అంటున్నారు.. సాధారణ కస్టమర్లు రూ.2 లక్షల వరకు లోన్ పొందే అవకాశం ఉంది.. ఇక, పెన్షన్ తీసుకునే వారు రూ.2.5 లక్షల వరకు, సర్వీస్ క్లాస్ రూ.5 లక్షల వరకు రుణం పొందే అవకాశం కల్పించింది.
Also Read: IBPS PO పీవో పోస్టులు.. దరఖాస్తుకు మరో ఛాన్స్!
తక్కువ వడ్డీకే రుణం అందుబాటులో ఉండటం కాకుండా మరో బెనిఫిట్ కూడా ఉంది. తొలి ఆరు నెలల వరకు ఈఎంఐ కూడా కట్టక్కర్లేదు. అయితే, ఈ రుణాలు అందరూ పొందే అవకాశం మాత్రం లేదు.
యోనో యాప్‌లో అర్హత కలిగిన కస్టమర్లకు ఈ లోన్ ఆఫర్ వర్తిస్తుంది. లేదంటే, పీఏపీఎల్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్ చివరి నాలుగు అంకెలు ఎంటర్ చేసి 567676కు ఎస్ఎంఎస్ చేయడం ద్వారా మీరు అర్హులా? కాదా? అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
Also Read: Micromax కొత్త ఫోన్లు వచ్చేశాయ్.. ధర ఎంతంటే?
మొత్తంగా.. కరోనా సమయంలో.. లోన్పొందే అవకాశంతో పాటు.. తొలి ఆరు నెలలు ఈఎంఐ కట్టాల్సిన అవసరంలేకుండా అవకాశం కల్పించింది.. తమ కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది ఎస్బీఐ.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..