Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

CLAT – 2020 పరీక్ష మరోసారి వాయిదా‌

దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాల‌యాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2020 నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌)ను వాయిదావేస్తున్నామ‌ని నేష‌న‌ల్ లా స్కూల్ ఆఫ్ ఇండియ‌న్ యూనివ‌ర్సిటీ బెంగ‌ళూరు వీసీ ప్రొ. సుధీర్ కృష్ణస్వామి ప్రకటించారు. ప‌రీక్ష తేదీల‌ను త్వర‌లో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24న క్లాట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దేశంలో […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

TSRJC CET-2020 దరఖాస్తు గడువు పెంపు

తెలంగాణలోని గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌ దరఖాస్తుల గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో.. 2020-21 విద్యాసంవత్సరానికిగాను ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఆంగ్ల మాధ్యమంలో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఆగస్టు 20 వరకు పొడిగించారు. ప్రవేశ పరీక్ష తేదీని తర్వాత వెల్లడించనున్నారు. గురుకులాల్లో ఇంటర్‌ ప్రవేశాల కోసం మార్చి నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మార్చి 16న ప్రారంభమయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌-2020) దరఖాస్తు సమర్పణ గడువును మరోసారి పొడిగించారు. జూలై 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. 3500 ప్రాథమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ సాధారణంగా 1.25 లక్షల వరకు వచ్చే దరఖాస్తులు ఈసారి 70వేలు పైచిలుకు మాత్రమే వచ్చాయి. కరోనా ఉద్ధృతి కారణంగా ప్రస్తుతం ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం లేనందున విద్యార్థులకు మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరూ ‘పాస్’ మార్చి […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

NIPER JEE 2020 వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే?

దేశవ్యాప్తంగా జులై 25న నిర్వహించాల్సిన నైపర్ జేఈఈ 2020 పరీక్ష వాయిదా పడింది. పరీక్షను సెప్టెంబరు 28న నిర్వహించనున్నట్లు అహ్మదాబాద్‌లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ & రిసెర్చ్ (NIPER)’ ఒక ప్రకటనలో తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ 14న నైపర్ జేఈఈ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జులై 25కి వాయిదా వేశారు. అయితే పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో మరోసారి పరీక్షను వాయిదా […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

CIPET Admissions 2020: సీపెట్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

* దరఖాస్తుకు జులై 31 వరకు అవకాశం హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ (సీపెట్‌)’ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సెంటర్ ఫర్ స్కిల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ (సీఎస్‌టీఎస్-హైదరాబాద్) వివిధ కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా డిప్లొమా, పోస్ట్‌ డిప్లొమా, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఆసక్తి, సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు జులై 31 […]

Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

ICAI Exams: సీఏ పరీక్షలు వాయిదా.. ఎప్పుడంటే?

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) సీఏ పరీక్షలను మరోసారి వాయిదా వేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో.. వాయిదాపడిన పరీక్షలను నవంబరులో నిర్వహిస్తామని తెలిపింది. ఫీజు పేమెంట్స్‌తో పాటు కోర్సు ప‌ర‌మైన రాయితీలు కూడా త‌దుప‌రి అంటెమ్ట్ కు బ‌దిలీ చేయ‌బ‌డ‌తాయ‌ని బోర్డు తెలిపింది. గ్రూప్స్, సెంట‌ర్స్ కూడా మార్చుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో మే, నవంబరు నెలల్లో రెండుసార్లు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మే నెలలో జరగాల్సిన పరీక్షలను కరోనా […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

జేఈఈ మెయిన్స్‌, నీట్‌ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలివే!

నీట్, జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణపై ఉన్న ఉత్కంఠతకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ రమేష్‌ పోఖ్రియాల్‌ ఎట్టకేలకు తెరదించారు. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌(జేఈఈ) మెయిన్స్‌, అదేవిధంగా నేషనల్‌ ఎలిజబిలిటీ కం ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) పరీక్షలను వాయిదావేస్తున్నట్లు ప్రకటించారు. కరోనా నేపథ్యంలో.. వాయిదాపడిన పరీక్షలను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. వీటితోపాటు జేఈఈ అడ్వాన్స్‌ను సైతం వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నిపుణుల బృందం సమర్పించిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోఖ్రియాల్ స్పష్టం చేశారు. […]

Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

తెలంగాణ‌లో ఎంసెట్ స‌హా ప్రవేశ ప‌రీక్షలు అన్ని వాయిదా

రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల నిర్వహణపై నెలకొన్న సస్పెన్స్‌ వీడింది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా కేసులు పెరుగుతున్నందున ఎంట్రెన్స్‌ టెస్టులను రద్దు చేయాలని కోరుతూ స్టూడెంట్‌ యూనియన్‌ నేతలు హైకోర్టులో పిల్‌ వేశారు. పిల్‌పై విచారణ సందర్భంగా రాష్ట్రంలో జరగనున్న వివిధ ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో రేపటి నుంచి జరగాల్సిన అన్ని ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. మే నెలలో ఎంట్రన్స్‌ టెస్టులు […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

NID Admit Card: ఎన్‌ఐడీ డీఏటీ-2020 అడ్మిట్‌ కార్డులు విడుదల

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడీఈఎస్‌), పీజీ డిప్లొమా ఇన్‌ డిజైన్‌ (పీజీడీపీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే డిజైన్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (డీఏటీ) హాల్‌టికెట్లను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) విడుదల చేసింది. ఈ ప్రవేశపరీక్ష ఆన్‌లైన్‌లో జరుగనుంది. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 22 నుంచి ప్రారంభమవాల్సి ఉన్నది. అయితే కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్ష తేదీ, సమయాలను అడ్మిట్‌కార్డులోనే పేర్కొన్నారు. కాగా.. డీఏటీ ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ వెయిటేజీలను కూడా ఎన్‌ఐడీ […]

Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఎల్పీసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు.. పరీక్ష ఎప్పుడంటే?

ఐటీఐ విద్యార్థులు పాలిటెక్నిక్‌ సెకండియర్‌లోకి ప్రవేశించేందుకు నిర్వహించే లేటరల్‌ ఎంట్రీ ఫర్‌ పాలిటెక్నిట్‌ ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఎల్పీసెట్‌)ను జులై 5న నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ఒక ప్రకటనలో తెలిపింది. అదే విధంగా దరఖాస్తు జూన్ 9 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా పాలిటెక్నిక్‌ కోర్సుల్లోకి ప్రవేశం కల్పించేందుకు నిర్వహించే పాలిసెట్‌ దరఖాస్తులను జూన్‌ 9 వరకు సమర్పించవచ్చని వెల్లడించింది. ఆలస్య రుసుముతో జూన్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని […]