Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

సివిల్స్‌ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులపై ప్రశంసలు

ఆగస్టు 4న విడుదలైన సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విదార్థులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించినందుకు సంతోషంగా ఉందంటూ బుధవారం (ఆగస్టు 5) ట్వీట్‌ చేశారు. ‘సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు మంచి ర్యాంకులతో ఘనవిజయాలు సాధించడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. వీరిందరికీ శుభాకాంక్షలు. తమ ప్రతిభను విధినిర్వహణలో చూపిస్తూ ప్రజలకు మంచి సేవలందిస్తారని ఆకాంక్షిస్తున్నాను’సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, ఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ వంటి అత్యున్నత […]

Latest News Results UPSC Jobs పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

సివిల్స్ ఫలితాలు.. టాపర్‌గా ‘రైతు బిడ్డ’

దేశంలోనే అత్యున్నత‌స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వహించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్షల ఫ‌లితాలు మంగళవారం (ఆగస్టు 4) విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో హర్యానాకు చెందిన రైతు బిడ్డ ప్రదీప్ సింగ్ జాతీయస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించడంతో.. అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రదీప్ ప్రస్తుతం ఫరీదాబాద్‌లో IRS ఆఫీసర్‌గా శిక్షణ పొందుతున్నాడు. రైతు కుటుంబానికి చెందిన ప్రదీప్ స్వగ్రామం సోనిపట్ జిల్లాలోని సోన్‌పట్‌లోని తెవ్రీ గ్రామం.. అతడి తండ్రి సుఖ్‌బీర్ సింగ్ రైతుగా పనిచేస్తున్నాడు. […]

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరూ ‘పాస్’ !!

రాష్ట్రంలో ఇప్పటికే పదోతరగతి పరీక్షలను వాయిదావేసిన ప్రభుత్వం తాజాగా.. ఓపెన్‌ స్కూల్స్‌ విద్యార్థులకు కూడా తీపికబురు వినిపించింది. ఓపెన్‌ స్కూల్‌ పదోతరగతి, ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పాస్‌ చేస్తూ.. ప్రభుత్వం జులై 24న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులందరికీ 35 మార్కులు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంతో 78 వేల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. వీరిలో పదోతరగతి నుంచి 35 వేలమంది విద్యార్థులు, ఇంటర్‌ నుంచి 43 వేల మంది విద్యార్థులు […]

Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

CBSE Class 10 Results: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల.. ఇక్కడ చూసుకోండి!

సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బుధవారం (జులై 15) విడుదల చేసింది. విద్యార్థులు సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలను సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు. జూలై 13న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఒక్కరోజు వ్యవధితో జులై 15న సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఫలితాల కోసం క్లిక్ చేయండి.. results.nic.in cbseresults.nic.in cbse.nic.in విద్యార్థులు SMS రూపంలోను ఫలితాలను […]

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

సీబీఎస్‌ఈ ఫలితాల్లో 600కు 600 మార్కులు

సీబీఎస్‌ఈ పన్నెండో తరగతి పరీక్షల్లో యూపీకి చెందిన బాలిక 100% మార్కులు సాధించింది. లక్నోకు చెందిన దివ్యాంశి జైన్‌(18) ఆర్ట్స్‌ విభాగంలోని ఆరు సబ్జెక్టుల్లోనూ 600కు 600 మార్కులు పొందింది. ఆర్ట్స్‌ విభాగంలో ఈ ఘనత సాధించడం బహుశా ఇదే తొలిసారని విద్యావేత్తలు భావిస్తున్నారు. లక్నోలోని నవయుగ్‌ రేడియన్స్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌లో 12వ తరగతి చదివింది. ఆమె తండ్రి వ్యాపారి. తల్లి గృహిణి. తన కుటుంబసభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం, టీచర్ల మార్గనిర్దేశం వల్లే తాను ఈ […]

Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

CBSE 12th Result 2020: సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ఫలితాలు విడుదల

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్‌(సీబీఎస్ఈ) 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షా ఫ‌లితాల‌ు విడుదలయ్యాయి. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల కోసం క్లిక్ చేయండి..  సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల్లో మొత్తం 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణుల‌య్యారు. గ‌తేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ సంద‌ర్భంగా ప‌రీక్షలు పాసై వారికి కేంద్ర మాన‌వ వ‌న‌రులశాఖ […]

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ప‌రీక్షా ఫ‌లితాల‌ు విడుదల

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ప‌రీక్షా ఫ‌లితాల‌ు శుక్రవారం (జులై 10) విడుదలయ్యాయి. జులై10న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫలితాలను విడుద‌ల చేశారు. విద్యార్థులు వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఎస్ఎంఎస్ రూపంలోనూ విద్యార్థులు తమ ఫలితాలను పొందే పొందే అవకాశాన్ని CISCE (Council for the Indian School Certificate Examination) కల్పించింది. ఐసీఎస్ఈ, ఐఎస్‌సీకి అనుబంధంగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త‌మ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ ద్వారా కెరీర్స్ పోర్టల్‌‌లోకి […]

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ISC 2020 Results: నేడే ఐసీఎస్ఈ క్లాస్ 10, ఐఎస్‌సీ క్లాస్ 12 ఫ‌లితాలు.. వెల్లడి సమయమిదే!

ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి ప‌రీక్షా ఫ‌లితాల‌ను శుక్రవారం (జులై 10) వెల్లడికానున్నాయి. జులై10న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫలితాలను విడుద‌ల చేయ‌నున్నారు. విద్యార్థులు https://cisce.org/ లేదా https://results.cisce.org/ వెబ్‌సైట్ల ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఎస్ఎంఎస్ రూపంలోనూ విద్యార్థులు తమ ఫలితాలను పొందే పొందే అవకాశాన్ని CISCE (Council for the Indian School Certificate Examination) కల్పించింది. ఐసీఎస్ఈ, ఐఎస్‌సీకి అనుబంధంగా ఉన్న పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త‌మ లాగిన్ ఐడీ, పాస్‌వ‌ర్డ్‌ […]

Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

TS SSC Memos: తెలంగాణ పదోతరగతి ఫలితాలు విడుదల.. మార్కుల మెమో డౌన్‌లోడ్ చేసుకోండి..!

* వెబ్‌సైట్‌లో విద్యార్థుల గ్రేడ్లు తెలంగాణలో పదోతరగతి ఫలితాలను జూన్ 22న అధికారులు వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లలో ఫలితాలను అందుబాటులో ఉంచారు. గ్రేడ్ల వారీగా ఫలితాలను ప్రకటించారు. ఇంటర్నల్ అసెస్‌మెంట్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లను కేటాయించారు. విద్యార్థులు సంబంధిత పాఠశాలల్లో మెమోలను తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. మెమోలలో ఏమైనా పొరపాట్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Latest News Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

TS Inter Results: ఇంటర్ ఫలితాలు విడుదల.. ఫలితాల్లో బాలికలదే పైచేయి!

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు గురువారం వెలువడ్డాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒక్కసారే విడుదల చేశారు. మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి.. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9,65,839  మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,80,516 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఉండగా.. 4,85,323 మంది […]