Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

TS EAMCET 2020 ఎంసెట్‌ ఎప్పుడంటే?

తెలంగాణలో ఎంసెట్ నిర్వహణ తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఎంసెట్‌తోపాటు.. ఈసెట్, పాలిసెట్ పరీక్షల నిర్వహణపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిప్రకారం సెప్టెంబరు 9, 10, 11, 14 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. అయితే అగ్రికల్చర్‌ విభాగం పరీక్షలు ఎప్పుడన్నది ఇంకా ఖరారు చేయలేదు. ఆన్‌లైన్‌ పరీక్షలు కావడం, సెప్టెంబరులోనే నీట్‌ ఉండటం, ఏపీ పరీక్షలు కూడా అదే నెలలో జరుపుతామని అక్కడి ప్రభుత్వం ప్రకటించినందున త్వరలో తేదీలను ఖరారు […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

ఐఐటీలు, ఐఐఎంలపై కేంద్రం కీలక నిర్ణయం!!

ఇటీవల నూతన విద్యా విధానాన్ని ఆవిష్కరించిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉన్నత విద్యా రంగంలోనూ పెనుమార్పులకు శ్రీకారం చుడుతోంది. ఐఐటీలు, ఐఐఎంలను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్ధ కిందకు తీసుకురావాలని యోచిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా యూజీసీ, ఏఐసీటీఈ నుంచి సూచనలను కోరుతోంది. విద్యార్ధులకు భౌతికంగా క్లాసులను నిర్వహించే భారాన్ని విద్యా సంస్ధలకు తగ్గించే దిశగా మొత్తం విద్యా వ్యవస్ధను ఆన్‌లైన్‌ విద్యా వ్యవస్థగా మార్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం. తొలుత ఉన్నత విద్యాసంస్ధలైన ఐఐటీలు, ఐఐఎంలను […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

TS: ఆగస్టు 20 నుంచి డిజి‌టల్‌ బోధన!

తెలంగాణలో ఆగస్టు 20 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శా‌లల్లో డిజి‌ట‌ల్‌/‌ఆ‌న్‌‌లైన్‌ బోధన అమ‌లు‌ చే‌సేందుకు విద్యా‌శాఖ కస‌రత్తు మొదలు పెట్టింది. ప్రైవేటు పాఠ‌శా‌లల్లో ఇప్ప‌టికే డిజి‌టల్‌ /ఆ‌న్‌‌లైన్‌ బోధన మొద‌లై‌న‌ప్పటికీ ఇప్పటి‌వ‌రకు విద్యా‌శాఖ అధి‌కా‌రి‌కంగా ధ్రువీ‌క‌రించ‌లేదు. దీంతో ఆగస్టు 20 నుంచి ప్రైవేటు పాఠ‌శా‌లల్లో డిజి‌టల్‌ బోధన ఎలా చేప‌ట్టా‌లన్న అంశా‌లపై విద్యా‌శాఖ మార్గద‌ర్శకా‌లను విడు‌దల చేయ‌నుంది. డిజి‌టల్‌ పాఠాల పేరుతో అధిక మొత్తంలో ఫీజులు వసూ‌లు‌చే‌యడం, ఫీజుల కోసం ఒత్తిడి చేయడం వంటి చర్య‌లకు ప్రైవేటు […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

CLAT 2020 ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే?

జాతీయస్థాయిలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌)-2020 ప్రవేశ పరీక్ష తేదీని అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం సెప్టెంబరు 7న క్లాట్ ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే నాలుగు పర్యాయాలు క్లాట్ పరీక్ష తేదీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాలయాల కన్సార్టియం ఆన్‌లైన్‌ పరీక్ష జరిగే తాజా తేదీని వెల్లడించింది. షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 7న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

APGS Exams: గ్రామ సచివాలయ పరీక్షల తేదీలు ఖరారు

ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కారణంగా వాయిదా పడిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షల నిర్వహణకు సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ మేరకు స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్ 20 నుంచి సచివాలయ ఉద్యోగాల భర్తీకి పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణపై చర్చించారు. సెప్టెంబరు 20 నుంచి […]

Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

CLAT – 2020 పరీక్ష మరోసారి వాయిదా‌

దేశంలోని 22 న్యాయ విశ్వవిద్యాల‌యాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్-2020 నిర‌వ‌ధికంగా వాయిదాప‌డింది. దేశంలో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేప‌థ్యంలో కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్‌)ను వాయిదావేస్తున్నామ‌ని నేష‌న‌ల్ లా స్కూల్ ఆఫ్ ఇండియ‌న్ యూనివ‌ర్సిటీ బెంగ‌ళూరు వీసీ ప్రొ. సుధీర్ కృష్ణస్వామి ప్రకటించారు. ప‌రీక్ష తేదీల‌ను త్వర‌లో వెల్లడిస్తామని ఆయన తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. మే 24న క్లాట్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే దేశంలో […]

Latest News Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

స్పోర్ట్స్‌ స్కూల్స్ ప్రవేశాలు.. చివరితేది ఎప్పుడంటే?

రాష్ట్రం‌లోని గిరి‌జన గురు‌కుల విద్యా‌సం‌స్థల్లో స్పోర్ట్స్‌ అకా‌డ‌మీ‌ల‌తో‌పాటు 2 స్పోర్ట్స్‌ స్కూల్స్‌, 2 క్రికెట్‌ అకా‌డ‌మీ‌ల్లో ప్రవేశాల కోసం తెలం‌గాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసి‌డె‌న్షి‌యల్‌ ఎడ్యు‌కే‌షన్ ఇన్‌‌స్టి‌ట్యూ‌షన్స్‌ సొసైటీ నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేసింది. దీనిద్వారా మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీలు, స్పోర్ట్స్‌ స్కూల్స్‌లో సీట్లను భర్తీ చేయ‌ను‌న్నారు. తెలం‌గాణ గిరి‌జన మినీ స్పోర్ట్స్‌ అకా‌డ‌మీల్లో 5 నుంచి 8 వ తర‌గతి వరకు, స్పోర్ట్స్‌ స్కూళ్ల‌లో 5వ తర‌గతి వారికి మాత్రమే అడ్మి‌షన్ల ప్రక్రియ చేప‌ట్ట‌ను‌న్నారు. పూర్తి వివ‌రా‌లకు […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

ఈ వర్సీటీ విద్యార్థులకు 20 నుంచి ఆన్‌లైన్‌ క్లాసెస్!!

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే విద్యా సంవ్సతరం ఆలస్యమవుతుండటంతో.. ఆన్‌లైన్ తరగతుల వైపు కొన్ని యూనివర్సిటీలు అడుగులు వేస్తున్నాయి.. తాజాగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కూడా ఆ కోవలోకి చేరింది. ఆగస్టు 20 నుంచి సెమిస్టర్ విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని హెచ్‌సీయూ నిర్ణయించింది. అదేవిధంగా ఆన్‌లైన్‌ తరగతుల ఏర్పాటు కోసం పేద విద్యార్థులకు గ్రాంట్‌ ఇవ్వాలని కూడా యూనివర్సిటీ నిర్ణయించింది. విద్యార్థులకు నెలకు రూ.1000 డిజిటల్‌ యాక్సెస్‌ గ్రాంట్‌ […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

AP Colleges: అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు ప్రారంభం

ఏపీలో అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం (ఆగస్టు 6) ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం జగన్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా.. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు.విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి సీఎం జగన్‌ అనుమతిచ్చారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. విద్యార్థుల […]

Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

త్వరలో విద్యా సంవత్సరంపై ప్రకటన: ప్రభుత్వం

* హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో విద్యా సంవత్సరంపై ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ప్రకటన రానుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు విన్నవించింది. రాష్ట్రంలో ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలని కోరుతూ.. హైదరాబాద్‌ స్కూల్స్‌ పేరెంట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం (ఆగస్టు 6) హైకోర్టులో విచారణ జరిగింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇచ్చింది. ఆన్‌లైన్‌, దూరవిద్య విధానంలో విద్యా సంవత్సరం ప్రారంభించాలని కేబినెట్‌ నిర్ణయించినట్లు కోర్టుకు తెలిపింది. […]