Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

AISSEE 2021: సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలు – ఉచిత విద్య.. ఉత్తమ శిక్షణ!

దేశవ్యాప్తంగా ఉన్న 33 సైనిక్ స్కూల్స్‌లో స్కూళ్లలో 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ ప్రకటన విడుదలైంది. దీనిద్వారా విద్యార్థులకు 6, 9వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. బాలికలకు మాత్రమే 6వ తరగతిలో మాత్రమే ప్రవేశాలు ఉంటాయి.

ఆయా తరగతుల్లో ప్రవేశపరీక్ష ఆధారంగా ప్రవేశ ప్రక్రియ ఉంటుంది. ప్రవేశపరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. సైనిక పాఠశాలల్లో గురుకుల విధానాన్నే అనుసరిస్తారు. ఇంగ్లిష్‌లోనే విద్యాబోధన ఉంటుంది.

Also Read: NIMS’లో బీఎస్సీ (న‌ర్సింగ్‌) కోర్సు.. అర్హతలివే


అన్ని ఉచితంగానే..
సామాజిక, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ నాణ్యమైన విద్యను, వసతిని ఉచితంగా అందిస్తారు. త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక స్కూళ్లను ఏర్పాటు చేసింది.

అర్హతలు..
★ సైనిక్ స్కూల్స్‌లో 6వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు 31.03.2021 నాటికి 10-12 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.04.2009 – 31.03.2011 మధ్య జన్మించి ఉండాలి. 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయసు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇక 6వ తరగతిలో ప్రవేశానికి బాలికలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

✦ అదేవిధంగా 9వ తరగతిలోకి ప్రవేశాలకు విద్యార్థుల వయసు 31.03.2021 నాటికి 13-15 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.04.2006 – 31.03.2008 మధ్య జన్మించి ఉండాలి. 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

★ ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. రాతపరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఫిజికల్, మెడికల్ పరీక్షలు నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు.

Also Read: NIMS: నిమ్స్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సు

దరఖాస్తు విధానం: సరైన అర్హతలున్న విద్యార్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు రూ. 400, ఇతరులు రూ.550 పరీక్ష ఫీజుగా చెల్లించాలి.

ఎంపిక విధానం..
రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షలు, మెడికల్ పరీక్షలు కూడా నిర్వహిస్తారు.


Also Read:  TS: వెటర్నరీ యూనివర్సిటీలో పాలిటెక్నిక్ కోర్సులు

పరీక్ష విధానం..
★ 6వ తరగతిలో ప్రవేశాల కోసం మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 125 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు – 150 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయించారు.

✦ అదేవిధంగా ఇంటలిజెన్స్-25 ప్రశ్నలు, లాంగ్వేజ్-25 ప్రశ్నలు, జనరల్ నాలెడ్జ్-25 ప్రశ్నలు.. మొత్తం 75 ప్రశ్నలు – 150 మార్కులు ఉంటాయి. అంటే ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు ఉంటాయి. అయిదో తరగతి సిలబస్ ప్రకారమే లాంగ్వేజ్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు

★ 9వ తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు – 200 మార్కులు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు.

✦ ఇక ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు. పరీక్ష సమయం 3 గంటలు.

Also Read: TS వ్యవసాయ వర్సిటీలో బీటెక్ ప్రవేశాలు.. వీరికి ప్రత్యేకం!

పరీక్ష ఎప్పుడు?
★ సైనిక స్కూళ్లల్లో ప్రవేశాల కోసం నిర్వహించే రాతపరీక్షను వచ్చే ఏడాది (2021) జనవరి 10న నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 181 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

✦ 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.

★ 9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, 6వ తరగతి విద్యార్థులకు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాసే వెసులుబాటు ఉంటుంది.

Also Read: CPGET Application: ‘సీపీగెట్’ దరఖాస్తు గడువు పెంపు


సీట్ల కేటాయింపు వివరాలు..
✦ ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాయిస్తారు.

★ అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీల్లేదు.

✦ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏపీలో కోరుకొండ సైనిక్ స్కూల్ (విజయనగరంలో), కలికిరి సైనిక్ స్కూల్ (చిత్తూరు)లో ప్రవేశాలు కల్పిస్తారు.

Also Read: AICTE: ఇంజినీరింగ్‌, బీఫార్మసీ తరగతుల ‘డేట్’ ఫిక్స్!


ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 20.10.2020.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 19.11.2020.

AISSEE – 2021 Notification

Online Application

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *