Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

ఏపీలాసెట్ ఫలితాలు వెల్లడి.. ఇక్కడ చూసుకోండి

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ లాసెట్‌-2020 పరీక్షల ఫలితాలు వెల్లడయ్యాయి. ఎస్కేయూ రెక్టార్‌ కృష్ణనాయక్‌, లాసెట్‌ కన్వీనర్‌ విజయ్‌కుమార్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.  మొదటిసారి విడుదల చేసిన ‘ప్రాథమిక కీ’లో తప్పులు ఉండటంతో మరోసారి అధికారులు ఫలితాలను విడుదల చేశారు.

ఫలితాల్లో మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం ప్రవేశ పరీక్షలకు 12,284 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 11,226 మంది ఉత్తీర్ణులయ్యారు. 91.38 శాతం ఉత్తీర్ణత లభించినట్లు అధికారులు తెలిపారు.
AP LAWCET & AP PGLCET – 2020 Results

ఏపీలో న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అనంతపురం ఆధ్వర్యంలో అక్టోబరు 1న ఏపీ లాసెట్‌ – 2020 పరీక్షను నిర్వహించారు. అయితే ఈ యూనివర్సిటీ ఇటీవల మొదటిసారి విడుదల చేసిన ‘కీ’లో తప్పులు  (AP LAWCET 2020 Answer Key) ఉండటంతో అందరినుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో యూనివర్సీటీ మరోసారి తుది ఫలితాలను విడుదల చేసింది.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *