సీఎస్ఐఆర్- యూజీసీ నెట్ జూన్ 2019 పరీక్ష హాల్టికెట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. నెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వెబ్సైట్ నుంచి తమ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి హాల్టికెట్లు పొందవచ్చు.
CSIR – UGC NET JUNE 2020 Admit Card
దేశంలోని వివిధ యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో సైన్స్ విభాగంలో లెక్చరర్షిప్, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం ‘సీఎస్ఐఆర్-యూజీసీ నెట్’ పరీక్ష నిర్వహిస్తారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) సంయుక్తంగా ఏడాదికి రెండుసార్లు (జూన్, డిసెంబరు) ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తాయి.
ఈ ఏడాది జూన్లో నిర్వహించాల్సి పరీక్ష కోవిడ్-19 కారణంగా వాయిదాపడింది. నవంబరు 19, 21, 26 తేదీల్లో పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. పరీక్షకు దాదాపు 2.72 లక్షల మంది అభ్యర్థలు హాజరుకానున్నారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు.
పరీక్షల షెడ్యూలు..
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..