* జనవరి 31న పరీక్ష నిర్వహణ
* పరీక్ష కేంద్రాలు మార్చుకునే అవకాశం
కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET) -2020 పరీక్ష తేదీ ఖరారైంది. కరోనా ప్రభావంతో వాయిదా పడిన కేంద్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సీటెట్)ను వచ్చే ఏడాది జనవరి 31న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
కొవిడ్-19తో పెద్ద సంఖ్యలో తమ స్వస్థలాలకు వెళ్లిన అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు పరీక్ష కేంద్రాలు మార్చుకునే వెసులుబాటు కల్పించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఉన్నతాధికారులు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల మార్పు కోరుకునే వారు నవంబరు 11 నుంచి 16 వరకు మార్చుకోవచ్చని తెలిపారు. పెరిగిన పరీక్ష కేంద్రాలు, ఇతర వివరాలకు ఇదే వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
PUBLIC NOTICE
పరీక్ష విధానం..
✦ పేపర్-1: ప్రైమరీ స్టేజ్ (పీఆర్టీ): మొత్తం 150 మార్కులకు పేపర్-1 రాతపరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 5 విభాగాలు ఉంటాయి. వీటిలో చైల్డ్ డెవలప్మెంట్ & పెడగోజీ, లాంగ్వేజ్-1, లాంగ్వేజ్-2, మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంశాల నుంచి ప్రతి విభాగంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 30 ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష సమయం 3 గంటలు.