Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

IBPS Exam Dates | బ్యాంక్ పరీక్షల తేదీలు వెల్లడి

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ, క్లర్క్, పీవో ప్రధాన పరీక్షల తేదీలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) వెల్లడింది. వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. ఆయా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షల తేదీలను చూసుకోవచ్చు.

Also Read: SSC CHSL ప్రిలిమినరీ ఆన్సర్ కీ విడుదల

ఐబీపీఎస్ విడుదల చేసిన షెడ్యూలులో గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి CRP RRB IX మెయిన్ ఎగ్జామినేషన్, పీవో పోస్టుల భర్తీకి నిర్వహించనున్న CRP PO/MT X మెయిన్ ఎగ్జామినేషన్, క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న CRP Clerks X మెయిన్ ఎగ్జామినేషన్ తేదీలు ఉన్నాయి.

Also Read: న‌వోద‌య విద్యాల‌యాల్లో 9వ త‌ర‌గ‌తి ప్రవేశాలు

ఐబీపీఎస్ షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది జనవరి 30న ఆర్‌ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష, ఫిబ్రవరి 20న ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 4న పీవో పరీక్ష, ఫిబ్రవరి 28న క్లర్క్ ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు.
IBPS RRB Clerk PO MT main exam schedule

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *