Uncategorized ప్రవేశాలు విద్యా ఉద్యోగ సమాచారం

న‌వోద‌య విద్యాల‌యాల్లో 9వ త‌ర‌గ‌తి ప్రవేశాలు

దేశవ్యాప్తంగా ఉన్న జ‌వ‌హర్ నవోద‌య విద్యాల‌యాల్లో 2021-22 విద్యాసంవ‌త్సరానికి గానూ.. 9వ త‌ర‌గ‌తి ప్రవేశాలకు ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. 8వ తరగతి చ‌దువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

వివ‌రాలు..

* నవోదయ ప్రవేశాలు – 9వ త‌ర‌గ‌తి

అర్హత‌: ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠ‌శాల‌ల్లో ఎనిమిదో తరగతి చ‌దువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు.

వయోప‌రిమితి: 01.05.2005 నుంచి 30.04.2009 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ప్రవేశ ప‌రీక్ష ఆధారంగా.

రాతపరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ సబ్జెక్టుల నుంచి 15 మార్కుల చొప్పున; మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టుల నుంచి 35 మార్కుల చొప్పున ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రత్యేక అవసరాలు గల అభ్యర్థులకు (దివ్యాంగులు) 30 నిమిషాల అదనపు సమయం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 04.11.2020.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివ‌రితేది: 15.12.2020.

* ప్రవేశ ప‌రీక్ష తేది: 13.02.2021.

JNVS Admission Notification 2020

Website

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *