కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL-2019) ‘టైర్-1’ పరీక్ష ప్రాథమిక కీని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో ఆన్సర్ కీని అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ జవాబులు సరిచూసుకోవచ్చు.
SSC CHSL 2019 Answer Key
Also Read: నేడు తెలంగాణ లాసెట్-2020 ఫలితాలు
ప్రాథమిక కీలో ఏమైనా సందేహాలుంటే అభ్యంతరాలు తెలపడానికి అవకాశం కల్పించారు. అభ్యర్థులు నవంబర్ 10 వరకు తమ అభ్యరంతరాలు తెలపవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో గత మార్చి, అక్టోబర్ నెలల్లో CHSL-2019 టైర్-1 పరీక్షలను నిర్వహించింది.
Also Read: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి ప్రవేశాలు
CHSL-2020 నోటిఫికేషన్..
CHSL-2020 నోటిఫికేషన్ను నవంబరు 6న విడుదలయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ కూడా నవంబరు 6 నుంచే ప్రారంభంకానుంది. పరీక్షను వచ్చేఏడాది ఏప్రిల్ నెలలో నిర్వహించనున్నారు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..