Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

తెలంగాణ ఎంసెట్ పరీక్షలు ప్రారంభం

* హాజరుకానున్న 1,43,165 మంది విద్యార్థులు

* సెప్టెంబ‌రు 9, 10, 11, 14వ తేదీల్లో పరీక్షలు

తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలు బుధవారం(సెప్టెంబరు 9) ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ఒక్క నిమిషం నిబంధన అమల్లో ఉండటంతో విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకోసం హాల్‌టికెట్‌తోపాటు పరీక్ష కేంద్రం మ్యాప్‌ను కూడా నిర్వాహకులు ఇచ్చారు.

Also Read: TS POLYCET కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల

కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో.. విద్యార్థులకు టెంపరేచర్‌ చెక్‌ చేసి, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకున్న తర్వాత లోపలకు పంపుతున్నారు. పరీక్షా కేంద్రాలను కూడా శానిటైజ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు.

విద్యార్థులు భౌతిక దూరం పాటించాలని పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లో బయోమెట్రిక్‌ బదులు ఫేస్‌ రికగ్నైజేషన్‌ విధానంలో విద్యార్థుల ఫొటోలు తీసుకోనున్నారు. తమకు కరోనా సంబంధ లక్షణాలు లేవని విద్యార్థులు సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read: TS EAMCET’కు సర్వం సిద్ధం.. కరోనా ఉంటే ‘నో’ ఎంట్రీ!

 

సెకండ్‌ సెషన్‌లో మధ్యాహ్నం పరీక్ష 3 గంటలకు ప్రారంభ మవుతుంది. తెలంగాణ, ఏపీలో కలిపి 102 (తెలంగాణలో 79, ఆంధ్రప్రదేశ్‌లో 23) కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 1,43,165 మంది విద్యార్థులు హాజరు కానున్నారు.

అగ్రికల్చర్ పరీక్షలు సెప్టెంబరు 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన హాల్‌టికెట్లను సెప్టెంబరు 21 నుంచి 25 వరకు అందుబాటులో ఉంచనున్నారు. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *