90.28 అభ్యర్థులు ఉత్తీర్ణత
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఐసెట్ (TS ICET 2020) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం (నవంబరు 2) వరంగల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి వరంగల్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పురుషోత్తం, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఫలితాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఐసెట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఐసెట్ హాల్‌టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ వివరాలు నమోదుచేసి ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS ICET 2020 Rank Card Download Here
TS ICET Result 2020 Download Here
ఈ ఏడాది ఐసెట్‌లో ప్రవేశానికి 58,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని 70 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 45,975 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా.. 41,506 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 90.28 ఉత్తీర్ణత శాతం నమోదైందని పేర్కొన్నారు.
టాప్-10 ర్యాంకర్లు వీరే..
మొదటి ర్యాంకు: బి.శ్రీభశ్రీ 159.5 మార్కులు (హైదరాబాద్)
రెండో ర్యాంకు: సందీప్ 144.50 (ఆర్మూర్, నిజామాబాద్)
మూడో ర్యాంకు: అవినాశ్ సిన్హా 142.43 (హైదరాబాద్)
నాలుగో ర్యాంకు: ప్రసన్న లక్ష్మి 142.45 (వరంగల్)
ఐదో ర్యాంకు: మదరవోని శ్రీకృష్ణ సాయి 141.40, (రంగారెడ్డి)
ఆరో ర్యాంకు: తిప్పర్తి అఖిల్‌రెడ్డి 140.933 (రంగారెడ్డి)
ఏడో ర్యాంకు: డి.జయదీప్ 140.22 (వెస్ట్ బెంగాల్)
ఎనిమిదో ర్యాంకు: పాటి అఖిల్‌రెడ్డి 139.11 (నెల్లూరు ఆంధ్రప్రదేశ్)
తొమ్మిదో ర్యాంకు: వీఎస్ రాజేఖర్‌రెడ్డి 136.50 (గుంటూరు- ఏపీ)
పదో ర్యాంకు: మహ్మద్ సొహైల్ 135.86 (భద్రాద్ది కొత్తగూడెం)