Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

TS: ఈసెట్‌కు సర్వం సిద్ధం.. నిమిషం ఆలస్యమైనా!

తెలంగాణలో ఆగస్టు 31న నిర్వహించనున్న టీఎస్ ఈసెట్ పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల వద్ద అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నారు.

ఆగస్టు 31న ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు తొలి విడతలో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో విడతలో ఆన్‌లైన్‌ విధనంలో ఈసెట్ పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి మొత్తం 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఈసెట్ ప్రవేశపరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించరు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు.

పరీక్ష నిర్వహణ కోసం 59 మంది పరిశీలకులు, 9 మంది ప్రత్యేక పరిశీలకులను ఉన్నతవిద్యామండలి నియమించింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నాణ్యమైన మాస్కు, శానిటైజర్‌ తెచ్చుకోవాలని, గుంపులుగా ఉండరాదని అధికారులు స్పష్టం చేశారు. చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు అనుమతించబోమన్నారు.

ఈ ఏడాది ఈసెట్‌ పరీక్షకు మొత్తం 28,015 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో తొలి విడతలో 14,415 మంది, రెండో 13,600 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు.

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *