ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించిన టీఎస్ ఐసెట్- 2020 ఫలితాలు, ఫైనల్ కీ ఈరోజు మధ్యాహ్నం 3.30గంలకు కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ కళాశాలలో విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి తెలిపారు.
Also Read: Bank Jobs: 647 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్
ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి విడుదల చేస్తారని చెప్పారు. కేయూ ఇన్‌ఛార్జి ఉపకులపతి డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తం పాల్గొంటారని తెలిపారు. సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీలలో జరిగిన పరీక్షలకు మొత్తం 45,975 మంది హాజరయ్యారని పేర్కొన్నారు.
Also Read: AP Jobs: ప్రకాశం, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌లో ఉద్యోగాలు
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఐసెట్ 2020 (TS ICET 2020)ను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 1 వరకు ఈ పరీక్ష జరిగింది. ఇందులో అర్హత సాధించిన విద్యార్థులు తెలంగాణలోని పలు యూనివర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.
Also Read: OUCDE: ఓయూలో దూరవిద్య కోర్సులు..
టీఎస్ ఐసెట్ పరీక్షకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి మొత్తం 58,452 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రెండు రాష్ట్రాల్లోని 70 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు.
మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..