Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

నేడు తెలంగాణ లాసెట్-2020 ఫ‌లితాలు

TS LAWCET 2020 Result: తెలంగాణలోని లా కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ లాసెట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ పాపిరెడ్డి మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఫ‌లితాల‌ను ప్రక‌టించనున్నారు.

లాసెట్‌తోపాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాల‌కోసం నిర్వహించిన పీజీఎల్‌సెట్ ఫ‌లితాలను కూడా వెల్లడించ‌నున్నారు.
Website

Also Read: న‌వోద‌య విద్యాల‌యాల్లో 9వ త‌ర‌గ‌తి ప్రవేశాలు

కరోనా నిబంధనల మధ్య అక్టోబ‌ర్ 9న లాసెట్ ప్రవేశపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఉస్మానియా విశ్వవిద్యాల‌యం పరీక్షలు నిర్వహించింది.

ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30,310 మంది అభ్యర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా.. 21,559 మంది ప‌రీక్షకు హాజ‌ర‌య్యారు. లాసెట్ ప‌రీక్ష ద్వారా మూడేళ్ల ఎల్ఎల్‌బీ, ఐదేళ్ల ఎల్ఎల్‌బీ ఆన‌ర్స్ కోర్సుల్లో ప్రవేశాలు క‌ల్పిస్తారు.

Also Read: Gold Rate Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. వెండి పైకి!


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *