Latest News Results Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

TS EAMCET మెడిక‌ల్, అగ్రిక‌ల్చర్ ఫ‌లితాలు విడుద‌ల‌

* 92.57 శాతం ఉత్తీర్ణత నమోదు

TS EAMCET మెడిక‌ల్ & అగ్రిక‌ల్చర్ ఫ‌లితాలు విడుద‌లయ్యాయి. కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్టీయూ ప్రాంగణంలో ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ పాపిరెడ్డి శ‌నివారం (అక్టోబరు 24) మ‌ధ్యాహ్నం ఫలితాలను విడుద‌ల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌తోపాటు పలు వెబ్‌సైట్లలోనూ ఫలితాలను అందుబాటులో ఉంచారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఆయా వెబ్‌సైట్లలో తమ ఫలితాలను చూసుకోవచ్చు.

Also Read: సైనిక స్కూళ్లల్లో ప్రవేశాలు – ఉచిత విద్య.. ఉత్తమ శిక్షణ!

ఫలితాల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చర్ విభాగంలో 92.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 63,857 మంది అభ్యర్థుల‌ు పరీక్షకు హాజరుకాగా.. 59,113 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఎంసెట్‌లో తొలి మూడు ర్యాంకులు అమ్మాయిలు కైవ‌సం చేసుకున్నారు. ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గుత్తి చైత‌న్య సింధు తొలి ర్యాంకు సాధించ‌గా, సంగారెడ్డికి చెందిన మారెడ్డి సాయి త్రిషా రెడ్డికి రెండో ర్యాంకు, తుమ్మల స్నికిత‌కు మూడో ర్యాంకు వ‌చ్చింది. న‌వంబ‌ర్‌లో కౌన్సెలింగ్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేయనున్నారు.

Also Read: ఇంటర్‌ విద్యార్థులకు ‘కానిస్టేబుల్‌’ శిక్షణ

టాప్-10 ర్యాంకర్లు వీరే..
1. గుత్తి చైత‌న్య సింధు – తొలి ర్యాంకు
2. మారెడ్డి సాయి త్రిషా రెడ్డి – రెండో ర్యాంకు
3. తుమ్మల స్నికిత – మూడో ర్యాంకు
4. ద‌ర్శి విష్ణు సాయి – నాలుగో ర్యాంకు
5. మ‌ల్లిడి రిషిత్ – ఐదో ర్యాంకు
6. చిగురుపాటి శ్రీమ‌ల్లిక్ – ఆరో ర్యాంకు
7. ఆవుల సుభాన్ – ఏడో ర్యాంకు
8. గార‌పాటి గుణ చైత‌న్య – ఎనిమిదో ర్యాంకు
9. గిండేటి విన‌య్ కుమార్ – తొమ్మిదో ర్యాంకు
10. కోట వెంక‌ట్ – ప‌దో ర్యాంకు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *