Latest News Uncategorized పరీక్ష ఫలితాలు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా ఉద్యోగ సమాచారం

Group-2 Result: ‘గ్రూపు-2’ ఉద్యోగాలకు 423 మంది ఎంపిక

ఏపీలో గ్రూప్-2 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాల స్థాయి అనుసరించి జోన్లు, జిల్లాల వారీగా 423 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు.

గ్రూప్-2 ఉద్యోగ నియామకాలకు సంబంధించి అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్లు (ఏపీ సచివాలయం), జూనియర్‌ అసిస్టెంట్స్‌, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ తహసీల్దారు, అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (పంచాయతీరాజ్‌), ప్రొహిబిషన్‌, అండ్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (కోఆపరేటివ్‌ సొసైటీ), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1 (దేవాదాయ), సీనియర్‌ ఆడిటర్‌ (రాష్ట్ర ఆడిట్‌ సబార్డినేట్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీ), జూనియర్‌ అసిస్టెంట్‌ (ఏపీపీఎస్సీ), ఇతర పోస్టులు ఈ జాబితాలో ఉన్నాయి.

మిగిలిన ఖాళీలను నియమ నిబంధనలు అనుసరించి ప్రధాన పరీక్షల ద్వారా అర్హత కలిగిన వారితో భర్తీ చేస్తామని పేర్కొంది. ఈ నియామకాలు హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉంటాయని వెల్లడించింది. ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచింది.

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *