Latest News Uncategorized

NIMSలో ‘స్టెమ్ సెల్స్’ ల్యాబ్ ప్రారంభం

హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్‌) మరో కీలక అడుగు వేసింది. నిమ్స్‌లో ‘స్టెమ్ సెల్స్ ల్యాబ్‌’ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి రాజేంద‌ర్ మీడియాతో మాట్లాడారు. రోజుకు 10 వేల టెస్టులు చేయ‌గ‌ల సామ‌ర్థ్యం ఈ ల్యాబ్ సొంత‌మ‌ని మంత్రి తెలిపారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధ‌ప‌డేవారికి ఈ ల్యాబ్ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. పేద ప్రజ‌ల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంద‌ని స్పష్టం చేశారు. నిమ్స్‌ను మ‌రింత అభివృద్ధి చేస్తున్నామ‌ని పేర్కొన్నారు.

Also Read: NLC India Ltd: గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటీస్ ఖాళీలు..

సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు అన్ని సౌక‌ర్యాల‌తో రూ. 250 కోట్లతో ఓపీ విభాగం ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. ప్రజ‌ల‌కు న‌మ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచేలా నిమ్స్‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు.

రాష్ట్రంలో 40 ల‌క్షల మందికి యాంటీబాడీస్ డెవ‌ల‌ప్ అయ్యాయ‌ని ఐసీఎంఆర్ చెప్పిన విష‌యాన్ని మంత్రి గుర్తు చేశారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి ప‌ట్ల ప్రభుత్వం అప్రమ‌త్తంగా ఉంది. కొద్ది మందిలో ఈ వైర‌స్ ల‌క్షణాలు అగుపిస్తున్నాయి. కొంద‌రిలో అగుపించ‌డం లేదు. ఈ క్రమంలో ప్రజ‌లు కూడా జాగ్రత్తగా ఉండాల‌ని సూచించారు.

Also Read: Moratorium: సామాన్యుడికి భారీ ఊరట.. వడ్డీపై వడ్డీ మాఫీ

కోవిడ్ కాలంలో ప్రజల సౌకర్యార్థం గచ్చిబౌలిలో TIMS‌ను కూడా ఏర్పాటు చేసుకున్నామని మంత్రి రాజేందర్ తెలిపారు. దీంట్లో కూడా వైద్యసేవ‌లు అందుతున్నాయని… న‌గ‌రానికి న‌లుమూల‌ల అద్భుత‌మైన వైద్యశాల‌లు నిర్మించ‌బోతున్నామ‌ని ఈటల తెలిపారు. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చ‌ర్యలు తీసుకుంటుంద‌ని మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ స్పష్టం చేశారు.

Also Read: Midhani Jobs: మిశ్రధాతు నిగం లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *