Latest News Uncategorized లైఫ్ స్టైల్

Cucumber Health Benefits: ‘కీరదోస’.. ఆరోగ్యానికి భరోసా!

కీరదోసకాయ ప్రాచీన కాలము నుండి సాగుబడిలో ఉన్న తీగ జాతి చెట్టు. ఎలా ఎంపిక చేసుకోవాలంటే?.. గట్టిగా ముడతలు లేనివి చూసి ఎంచుకోవలెను. కీరదోసకాయ మెత్తదైతే పండినదని అర్థము. కీరదోస (cucumber) శాస్త్రీయ నామం – కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినది.

చల్లగా చూడగానే తినాలపించే కీరదోస వేసవిలో సాంత్వన నివ్వడమే కాదు దానిలోని పుష్కలమైన పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. రీహైడ్రేటింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో పాటు రక్తపోటుతో బాధపడేవారికి ఇది చక్కని ఆహారం.

చెమట ద్వారా కోల్పోయిన నీటిని, లవణాలను శరీరానికి తిరిగి అందించడంలో కీరదోస చక్కని పాత్ర పోషిస్తుంది. రోజూ కప్పు కీరదోస రసం తాగితే మేని నిగారింపు సంతరించుకుంటుంది. దీని నుంచి అవసరమైన ఫొలేట్‌తో పాటు విటమిన్‌- ఎ, సిలు పుష్కలంగా లభిస్తాయి. దోస తొక్కలో ” విటమిన్ ‘కే’ ” సమృద్ధిగా ఉన్నందున చేర్మానికి మేలుచేస్తుంది.

పోషక విలువలు..

శక్తి: 13కి.కెలోరీలు; మాంసకృత్తులు: 0.4గ్రా; కార్బోహైడ్రేట్లు: 2.5గ్రా; కొవ్వు: 0.1 గ్రా; పీచు: 2.6; సోడియం: 10.2మి.గ్రా; పొటాషియం: 50మి.గ్రా.

తొక్కతోనే తినాలి: దోసకాయను తోక్కతోనే తినాలి,దోసకాయను ఉరగాయగా చేసి తినకూడదు.

ఆరోగ్య ప్రయోజనాలు..

 జీర్ణక్రియ: దోస కడుపులోని మంటను తగ్గిస్తుంది, జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

ఎసిడిటీ: కీరదోసకాయ జ్యూస్ తాగడం ద్వారా అందులో ఉండే ఖనిజాలలోని ఆల్కలైన్‌ స్వభావమువల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. దీంతో ఎసిడిటీ సమస్య తగ్గుతుంది . అలాగే కీరదోసకాయ జ్యూస్ గ్యాస్ట్రిక్, డియోడినం అల్సర్లకు చికిత్సగా ఉపయోగపడి ఉపశయనం కలిగిస్తుంది .

రక్తపోటు: దోసకాయలో ఉన్న “పొటాషియం ” రక్తపోటులోని హెచ్చు తగ్గులను సవరిస్తుంది. ఎటువంటి రంగులు లేని కీరదోసకాయ జ్యూస్ వలన రక్తప్రసరణ క్రమ బద్ధంగా ఉంటుంది . ఇందులోని ఖనిజాలు సోడియాన్ని నియంత్రిస్తాయి.

చలువ: వాతావరణం పొడిగా, వేడిగా ఉన్న రోజుల్లో కీరదోసకాయ జ్యాస్ ఏవైనా ఆకుకూరల రసంతో కలిపి తీసుకుంటే చలువ చేస్తుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యముగా ఉండేలా చేస్తుంది.
మూత్ర విసర్జన: మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోవడానికి, మూత్ర విసర్జన చక్కగా జరగడానికి దోహదపడుతుంది.

నొప్పితో కూడిన వావు: కీళ్ళలో ఉండే యూరిక్ యాసిడ్‌ను తొలగించడం వల్ల వాపు, నొప్పి తగ్గిపోతాయి. ఆర్త్రైటిస్, గౌట్ వ్యాధులకు ఇది మంచి ఔషదంగా పనిచేస్తుది.

జుట్టు పెరుగుదల: కీరదోసకాయలో గల సిలికాన్‌, సల్ఫర్ ఖనిజలవణాలు జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది.

చర్మం మెరుగుదల: ఇందులోగల అధిక ‘సి’ విటమిన్‌ వల్ల చర్మ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. సౌందర్య పోషకాలలో కీరదోసకాయ తప్పక ఉంటుంది . ఎగ్జిమ, తామర, సోరియాసిస్ వంటి చర్మ వ్యాదులకు చికిత్సకోసం కీరదోసకాయ వాడవచ్చును .

ఎండలో చర్మము కమిలిపోవడం: తీవ్రమైన ఎండవలన చర్మమము కమిలి పోతుంది. అప్పుడు కీరదోసకాయ రసం తీసి కమిలిన చోట రాస్తే చల్లగా ఉండి శరీరానికి ఉపశయనం కలుగుతుంది.

Also Read: నానబెట్టిన బాదమే ఎందుకు తినాలి? కారణమిదే!

శరీరంలో నీటినిల్వ: కీరదోసకాయ రసంలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అందువలన శరీరంలో తగిన మోతాదులో నీటి నిల్వకు దోహదం చేస్తాయి.

కళ్ళు చలువ: కీరదోసకాయని గుండ్రని ముక్కలుగా తరిగి కళ్ళపై ఉంచితే మంటలు తగ్గి, కళ్ళు చల్లగా ఉంటాయి. వేడి తగ్గుతుంది. కళ్ళ వాపు తగ్గుతుంది. కళ్ళ కింద నల్లటి చారలను కీరదోసకాయ ముక్కలు తొలగించును.

గోళ్ళ అందం: దోస లోని లవణాలు గోళ్ళను అందంగా, చిట్ల కుండా ఉంచుతాయి.

చెడు శ్వాస: ఒక దోసకాయ ముక్కని 30 సెకన్ల పాటు నాలుకతో నోటి మీద పట్టుకొని ఉంటే చెడు శ్వాసకి కారణమైన బ్యాక్టీరియాను చంపేస్తుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *