Uncategorized లైఫ్ స్టైల్

నానబెట్టిన బాదమే ఎందుకు తినాలి? కారణమిదే!

బాదం పప్పులు కాస్త రేటు ఎక్కువే. కానీ.. వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అంతకంటే ఎక్కువ. ఈ మధ్యకాలంలో చాలా మంది రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే వాటిని తింటున్నారు. ఇలా తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా? నానబెట్టిన బాదం పప్పులో ఎలాంటి పోషక విలువలున్నాయో తెలుసా?.. బరువు తగ్గడం నుంచి రక్తపోటు అదుపులో ఉంచుకోవడం వరకూ.. గుండె ఆరోగ్యాన్ని కాపాడడం నుంచి కాన్సర్ ముప్పుని తగ్గించడం వరకు.. బాదం చేసే మేలు అంతా ఇంతా కాదు. దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నోరకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
రోజూ నానబెట్టిన బాదాం పప్పులు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే..? బాదం ముడిగా తినాలా లేదా నానబెట్టినవి తినాలా అన్నది రుచికి సంబంధించినదే కాదు.. ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..!
 

నానబెట్టిన బాదం ఎందుకు మంచిది..?

 

బాదం తొక్కలో టానిన్లు ఉంటాయి.. అవి పోషకాలను శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. కాబట్టి బాదం పప్పులను నానబెట్టి తినడం.. అందులోనూ తొక్కతీసి తినడం వల్ల శరీరానికి పోషకాలన్ని సక్రమంగా అందుతాయి. నానబెట్టిన బాదం పప్పులను తొక్కతీసి బాక్స్‌లో పెట్టుకుంటే 4,5 రోజుల వరకు నిల్వ ఉంటాయి. రాత్రి నానబెట్టి.. ఉదయాన్నే వాటిని తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఎలా నానబెట్టాలి..?

శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపే గుణం బాదం పప్పుకు ఉంది. మన పెద్దలు చెప్పిన ప్రకారం.. బాదం పప్పులను నేరుగా తినడం కన్నా నానబెట్టుకొని తింటే మన శరీరానికి పోషకాలు ఫూర్తిస్థాయిలో అందుతాయి. బాదం పప్పులను ముందురోజు రాత్రి అర కప్పు నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయమే వాటిపై ఉన్న పొట్టును తీసివేయాలి. నానబెట్టిన బాదంలో పీచు పదార్థం పుష్కలంగా  ఉంటుంది. అదేవిధంగా వీటిలో విటమిన్-ఇ, ఒమెగా3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని మిల్క్‌షేక్‌, ఇతర రూపాల్లోనూ తీసుకోవచ్చు.

బాదం పప్పు యొక్క పోషక విలువలు:

143 గ్రాముల బాదం పప్పులో ఉండే పదార్థాల పోషక విలువలు  
పోషక పదార్థం       విలువలు
తేమ                         6.31గ్రాం
ప్రోటిను                   30.24గ్రాం
పిండిపదార్థాలు    30.82గ్రాం
చక్కెర                      6.01గ్రాం
పీచుపదార్థం           17.9
శక్తి                            828Kcal
మొత్తం ఫ్యాట్      71.4గ్రాం

బాదం పప్పులో ఐరన్(ఇనుము), కాల్షియం, మెగ్నిషియం, జింకు, ఫాస్పరసు, సోడియం ఖనిజాలు విరివిగా ఉన్నాయి
నానబెట్టిన బాదం వల్ల కలిగే ప్రయోజానాలు..

రోగనిరోధక వ్యవస్థ: నానబెట్టిన బాదం తినటం వలన రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. మీ ఆహారనాళంలో మంచి బ్యాక్టీరియా పెరగటానికి దోహదపడుతుంది మరియి దాని ఫలితంగా, అనేక వ్యాధులను నివారించటంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
ప్రెగ్నెన్సీ: ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళు నానబెట్టిన బాదం తినటం వల్ల బేబి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తల్లికి, బిడ్డకి ఎక్కువ పోషణ, శక్తిని అందిస్తాయి. అంతేకాక బాదంపప్పులలోని ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తాయి.
చర్మంపై ముడుతలు: నానబెట్టిన బాదం తినటం వల్ల సహజంగా వయస్సు మీరకుండా చూసే ఆహారంగా పనిచేస్తాయి. ప్రతిరోజు పొద్దున ఇవి తిని మీ చర్మాన్ని గట్టిగా, ముడతలు లేకుండా చేసుకోండి.
గుండెకు: నానబెట్టిన పది బాదం పప్పులను వారంలో ఐదుసార్లు తీసుకొంటే హృద్రోగ సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో విటమిన్‌ ‘ఇ’ ఉంటుంది. ఇది చక్కని యాంటీఆక్సిడెంట్‌.
కొలెస్ట్రాల్‌ నియంత్రణ: వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు బాదంపప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది.

 

రక్తప్రసరణ: బాదంలో పొటాషియం ఎక్కువ, సోడియం శాతం చాలా తక్కువ. కాబట్టి రక్తపోటు సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
కండరాల నొప్పులు: ఇందులో లభించే మెగ్నీషియం కండరాల నొప్పులను దూరం చేసి అవి దృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.
ఎముకలు దృఢంగా: ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది.
బరువుతగ్గడానికి: బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.

 

ఆరోగ్యకరమైన జుట్టు: మన జుట్టుకు కావాల్సిన అన్ని రకాల విటమిన్లూ, పోషకాలూ… బాదంలలో ఉంటాయి. ముఖ్యంగా జుట్టును ఒత్తుగా, గట్టిగా, బలంగా, ధ్రుడంగా పెంచే మెగ్నీషియం, జింక్ వంటివీ, విటమిన్ E బాదంలలో ఉంటాయి. అలాగే… జుట్టును ఎక్కువ కాలం నిలిచివుండేలా చేసే విటమిన్ B… బాదంపప్పుల్లో ఉంటుంది.
తక్షణశక్తికి: అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, రాగి, మెగ్నీషియం.. వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను చేరవేస్తుంది. అందుకని దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
మధుమేహానికి: మధుమేహంతో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.
జ్ఞాపకశక్తి: నానబెట్టిన రెండు మూడు బాదం పప్పులు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
మలబద్దకం దూరం: వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. మలబద్ధకం, ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
పెద్దప్రేగు క్యాన్సర్: నానబెట్టిన బాదం తినడము వలన పెద్దప్రేగుకు క్యాన్సర్ రాకుండ ఉంటుంది. బాదం పప్పులు పోషకాలలోనే కాదు, వంటకాలలో వాడుకోడానికి కూడా చక్కగా పనికొస్తాయి. బాదం ఒమేగా-3, విటమిన్-ఇ లాంటి పోషకాలతో సమృద్ధమైంది. బాదం తిన్నాక నిండుగా అనిపించి తొందరగా ఆకలి వేయదు. పాయసం మీద సన్నని పలుకులుగా చేసి చల్లినా, నూరి కుర్మా లో వాడినా, నానబెట్టి రుబ్బి బాదం పాలు తయారుచేసినా అందరూ ఇష్టపడతారు. బాదంలో అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి. అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం ప్లాస్మా, ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది, కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఈ లాభాలన్నిటినీ పొందాలంటే వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల ఆనంద, ఆరోగ్యకరమైన జీవితం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *