నేషనల్ ఫర్టిలైజర్ లిమిటెడ్(NFL) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువును పొడిగించింది. మొత్తం 52 ఖాళీలతో గతంలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు మే 27న ముగుస్తుందని నోటిఫికేషన్లో వెల్లడించింది. కానీ లాక్డౌన్ కొనసాగుతుండటంతో దరఖాస్తు గడువును పొడిగించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంజనీర్, మేనేజర్, సీనియర్ కెమిస్ట్ లాంటి పోస్టులును భర్తీ చేస్తుంది. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ చదివి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు..
మొత్తం ఖాళీలు: 52
పోస్టులు – ఖాళీలు: ఇంజనీర్ (ప్రొడక్షన్): 01, మేనేజర్ (ప్రొడక్షన్): 16, ఇంజనీర్ (మెకానికల్): 5, మేనేజర్ (మెకానికల్): 12, ఇంజనీర్ (ఎలక్ట్రికల్): 03, మేనేజర్ (ఎలక్ట్రికల్): 02, ఇంజనీర్ (ఇన్స్ట్రుమెంటేషన్): 05, ఇంజనీర్ (సివిల్): 01, సీనియర్ కెమిస్ట్ (కెమికల్ ల్యాబ్): 06, ఇంజనీర్ (ఫైర్ అండ్ సేఫ్టీ): 01
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ లాంటి విభాగాల్లో బీటెక్, బీఈ పాసైనవాళ్లు దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.700. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వికలాంగులు, డిపార్ట్మెంట్ అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులు పంపడానికి చివరితేదీ: 30.06.2020.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
General Manager (HR),
National Fertilizers Limited,
A-11, Sector-24, Noida,
District Gautam Budh Nagar, Uttar Pradesh – 201301.
Read Also: మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి.