All India Jobs Government Jobs SSC Jobs Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

SSC CHSL 2020 నోటిఫికేషన్ విడుదల (చివరితేది: 15.12.2020)

కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవల్ ఎగ్జామినేషన్-2020కు నోటిఫికేషన్ వెలువడింది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఆసక్తి, సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 6 నుంచి ఆన్‌లైన్ ద్వారా డిసెంబరు 17 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: DIC Jobs: డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఖాళీలు

దీనిద్వారా పలు విభాగాల్లోని లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA), పోస్టల్ అసిస్టెంట్ (PA), సార్టింగ్ అసిస్టెంట్ (SA), డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) పోస్టులను భర్తీచేయనున్నారు. ఇంటర్ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి వచ్చే ఏడాది మార్చి 16 నుంచి 27 వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.


Also Read: BEL Jobs: భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు


* కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్-2020

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయోపరిమితి: 01.01.2021 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. 02.01.1994 – 01.01.2003 మధ్య జన్మించి ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


Also Read: TSACS Jobs: తెలంగాణ ఏఆర్‌టీ సెంటర్లలో ఉద్యోగాలు..


దరఖాస్తు విధానం:
 ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: టైర్-1 (ఆన్‌లైన్), టైర్-2 (డిస్క్రిప్టివ్ పేపర్), టైర్-3 (స్కిల్ టెస్ట్/టైపింగ్ టెస్ట్) పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా.

‘టైర్-1’ పరీక్ష విధానం..
➦ మొత్తం 200 మార్కులకు టైర్-1 ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
* మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ఇంగ్లిష్ లాంగ్వే్జ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు-50 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 25 ప్రశ్నలు-50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ 25 ప్రశ్నలు-50 మార్కులు.
➦ పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 80 నిమిషాల పాటు పరీక్ష ఉంటుంది.
* హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
➦ పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కులు కోత విధిస్తారు.


Also Read: Army School Jobs: ఆర్మీ ప‌బ్లిక్ స్కూల్‌లో ఉద్యోగాలు(చివ‌రి తేది: 15.11.2020)

‘టైర్-2’ పరీక్ష విధానం..
➦ టైర్-1 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-2 (డిస్క్రిప్టివ్) పరీక్ష నిర్వహిస్తారు.
* 100 మార్కులకు డిస్క్రిప్టివ్ పరీక్ష నిర్వహిస్తారు. పెన్, పేపర్ విధానంలో పరీక్ష ఉంటుంది.
➦ పరీక్షలో భాగంగా 200-250 పదాలతో వ్యాసం (ఎస్సే), 150-200 పదాలతో లెటర్ లేదా అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది.
* పరీక్ష సమయం 60 నిమిషాలు (గంట). నిబంధనల ప్రకారం అనుమతి ఉన్నవారికి 20 నిమిషాల అదనపు సమయం కేటాయిస్తారు.
➦ కనీస అర్హత మార్కులు 33గా నిర్ణయించారు.


Also Read: RITES Jobs: రైట్స్ లిమిటెడ్‌లో 170 ఇంజినీర్ పోస్టులు (చివ‌రి తేది: 26.11.2020)


‘టైర్-3’ పరీక్ష విధానం..

* టైర్-2 పరీక్షలో అర్హత సాధించినవారికి టైర్-3 (స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
➦ కంప్యూటర్‌లో టైపింగ్ చేయాల్సి ఉంటుంది.
* పోస్టుల వారీగా స్కిల్ టెస్ట్/ టైపింగ్ టెస్ట్ వేర్వేరుగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.11.2020

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 15.12.2020 (23:30)

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేది: 17.12.2020 (23:30)

ఆఫ్‌‌లైన్ చలానా జనరేషన్‌కు చివరితేది: 19.12.2020 (23:30)

చలానా ద్వారా ఫీజు చెల్లించడానికి చివరితేది: 21.12.2020

కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (టైర్-1): 12.04.2021 – 27.04.2021

టైర్-2 రాతపరీక్ష (డిస్క్రిప్టివ్ పేపర్): ప్రకటించాల్సి ఉంది.

SSC CHSL Notification 2020

Online Application

మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల కోసం క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *