Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షల తేదీలు వెల్లడి.. ఏ పరీక్ష ఎప్పుడంటే?

కరోనా వైరస్, లాక్‌డౌన్ నేపథ్యంలో వాయిదాపడిన వివిధ పరీక్షల తాజా షెడ్యూలును స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలను అందుబాటులో ఉంచింది. ఆయా పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షల షెడ్యూలను చూసుకోవచ్చు.

కొత్తగా ప్రకటించిన తేదీల్లో కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామ్ టైర్-1 పరీక్షతోపాటు.. జూనియర్ ఇంజినీర్ పేపర్-1 పరీక్ష, సెలక్షన్ పోస్టుల పరీక్ష (ఫేజ్-8), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామ్ 2019, సీఏపీఎఫ్ ఎగ్జామినేషన్ (పేపర్-1)-2020, జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-హిందీ ప్రధ్యాపక్ ఎగ్జామినేషన్-2020, కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషణ్ (టైర్-2)-2019 పరీక్షలు ఉన్నాయి.

ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షలాదిమంది నిరుద్యోగ అభ్యర్థులు హాజరవుతారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలోనే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే ఉద్యోగ పరీక్షలకు అభ్యర్థులు హాజరవుతుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *