దేశీయ పారిశ్రామిక సంస్థ రిలయన్స్ సంచనాలు సృష్టిస్తోంది. ఎవరూ ఊహించని విధంగా వ్యాపారరంగంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకుపోతున్నది. ఇప్పటికే టెలికాం రంగంలోకి ప్రవేశించి జియోను స్థాపించిన రిలయన్స్ సంస్థ ఇప్పుడు మరో సంచలనానికి తెరతీసింది.
Also Read: iPhone 12 series: ఐఫోన్ 12 స్మార్ట్ఫోన్లు వచ్చేశాయ్.. ధర ఎంతంటే?
త్వరలోనే ఇండియాలో 5జీ నెట్ వర్క్ ప్రారంభం కాబోతున్నది. ఇండియాలో ఇప్పటికే 5జీ మొబైల్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఈ 5జీ మొబైల్ ఫోన్లు ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండటం లేదు. వీటి ధర రూ.27 వేల నుంచి ప్రారంభం అవుతుంది.
సామాన్యులను దృష్టిలో పెట్టుకొని రిలయన్స్ సంస్థ ప్రపంచంలోనే అతి తక్కువ ధరకు 5జీ మొబైల్ ను అందించాలని లక్ష్యంగా పెట్టుకొని 5 జీ మొబైల్ ఫోన్ ను త్వరలోనే లాంచ్ చేస్తామని ప్రకటించింది.
Also Read: CPGET Application: ‘సీపీగెట్’ దరఖాస్తు గడువు పెంపు
వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి జియో 5జీ మొబైల్ ధర రూ.2500 నుంచి మూడువేల రూపాయల వరకు ఉండొచ్చని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి. ఇండియాలో 35 కోట్ల మంది ఇంకా 2జీ మొబైల్స్ ను వాడుతున్నారు. వీరిని ఆకర్షించడమే లక్ష్యంగా జియో అతి తక్కువ ధరకు 5జీ మొబైల్ ను తీసుకురాబోతుంది.
Also Read: RGUKT: ‘ట్రిపుల్ ఐటీ’ ప్రవేశాల తొలి జాబితా విడుదల.. కౌన్సెలింగ్ ఎప్పుడంటే?
గూగుల్ తో చేతులు కలిపిన జియో ఈ మొబైల్ ను తయారు చేసేందుకు సిద్ధం అవుతున్నది. అయితే, దీనిని ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.