దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఇండియాలో కొత్త ‘ఇన్’ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. రెండు కొత్త హ్యాండ్సెట్ట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1, మైక్రోమాక్స్ ఇన్ 1 బీ వేరియంట్లను మంగళవారం (నవంబరు 3) లాంచ్ చేసింది. మార్కెట్లో పోటీ ధరలకు భిన్నంగా బడ్జెట్ ధరల్లో తనకొత్త స్మార్ట్ఫోన్లను తీసుకొచ్చింది. గేమింగ్ అనుభవం కోసం 1బీ పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
మైక్రోమాక్స్ ఇండియా సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ఈ కొత్త ఫోన్లను ఆవిష్కరించారు. ఈ కొత్త ఫోన్లు భారత విపణిలో పాగావేసేందుకు, చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు గట్టి పోటీనిస్తాయని రాహుల్ శర్మ నొక్కి చెప్పారు. ఏదైనా ఉత్పత్తిని కొనడానికి ముందు లోతుగా పరిగణించి చేయాలని, భారత తయారీ అని పక్కన పెట్టేయవద్దని శర్మ పేర్కొన్నాడు. ఫ్లిప్‌కార్ట్‌తోపాటు, మైక్రోమాక్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో విక్రయించనున్నారు. నవంబరు 24 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1ఫీచర్లు..
6.67అంగుళాల పూర్తి హెచ్డీ + డిస్ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
మీడియా టెక్హీలియో జీ 85 ప్రాసెసర్
48+5+2+2 ఎంపీరియర ఏఐ క్వాడ్ కెమెరా
16 ఎంపీ సెల్ఫీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
18 వా (టైప్-సి)
ధరలు..
4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999
4 జీబీ + 128 జీబీ వేరియంట్ మోడల్‌కు రూ.12,499.
మైక్రోమాక్స్ ఇన్1 బీ ఫీచర్లు..
6.5 హెచ్డీ డిస్ప్లే
ఆండ్రాయిడ్ 10 (స్టాక్ యుఐ)
మీడియా టెక్ హీలియో జీ35 ప్రాసెసర్
13+2 ఎంపీ రియర్ ఏఐ కెమెరా
8 ఎంపీ సెల్పీకెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
పర్పుల్, బ్లూ , గ్రీన్ రంగుల్లో లభ్యం.
ధరలు..
2 జీబీ + 32 జీబీ వేరియంట్ ధర రూ.ధర రూ.6,999
4 జీబీ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర రూ.7,999