దేశీయ మొబైల్ తయారీ సంస్థ Micromax సరికొత్త మొబైల్స్‌తో మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఇన్’ సిరీస్‌లో ఈ స్మార్ట్ఫోన్లను తీసుకురానుంది. తాజాగా ఆ ఫోన్ల ఆవిష్కరణకు సంబంధించిన తేదీని మైక్రోమ్యాక్స్ సంస్థ వెల్లడించింది.
Also Read: భారీగా దిగొచ్చిన బంగారం ధరలు.. వెండి పతనం
నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు ‘ఇన్’ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ టీజర్ షేర్ చేసింది. వర్చువల్‌గా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
Also Read: Jio మరో సంచలనం.. కేవలం రూ.2500కే 5జీ స్మార్ట్‌ఫోన్!
అయితే ఎలాంటి మోడల్ ఫోన్లను తీసుకురాబోతున్నారు? వాటి ధరలు ఎంత? అన్న విషయాలపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కొత్తగా రాబోయే Micromax ఫోన్ల ధరలు రూ.7వేల నుంచి రూ.25వేల బడ్జెట్ మధ్య తీసుకురానున్నట్లు కంపెనీ సీఈవో రాహుల్ శర్మ ఓ సందర్భంలో వెల్లడించారు.
Also Read: iPhone 12 స్మార్ట్‌ఫోన్ ధరలు ఎంతంటే?
‘యాడ్’ ఫ్రీగా..
మైక్రోమ్యాక్స్ సంస్థ కొత్తగా తేనున్న ఫోన్లలో ఎలాంటి యాడ్స్ ఉండబోవని, బ్లోట్ వేర్ కూడా ఉండదని కంపెనీ చెబుతోంది. వ్యక్తిగత డేటా సేకరించబోమని హామీ ఇస్తోంది. భారత్-చైనా మధ్య ఘర్షణ పూరిత వాతావరణం, వ్యక్తిగత డేటా వంటి అంశాలపై చర్చ జరుగుతున్న వేళ మైక్రోమ్యాక్స్ రీ ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఈ ఫోన్లు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మరికొద్దిరోజులు ఆగాల్సిందే.
మరిన్ని టెక్ వార్తల కోసం క్లిక్ చేయండి..