Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

‘టిమ్స్‌’లో 499 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చి సెంటర్‌ (టిమ్స్‌)’ కాంట్రాక్ట్ పద్ధతిలో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) ఈ నియామక ప్రక్రియ చేపట్టనుంది. పోస్టులకు ఎంపికైనవారు విధిగా ఏడాది పాటు పనిచేయాల్సి ఉంటుంది. జూన్ 16 నుంచి 19 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అందుబాటులో ఉండనుంది. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు జూన్ 19న సాయంత్రం 5 గంటల్లోపు తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు…

* మొత్తం ఖాళీల సంఖ్య: 499

➦ ప్రొఫెసర్-14

అసోసియేట్ ప్రొఫెసర్-24

➦ అసిస్టెంట్ ప్రొఫెసర్-48

నర్సింగ్ సూపరింటెండెంట్-01

➦ అసిస్టెంట్/డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్/హెడ్ నర్స్-20

స్టాఫ్ నర్స్-246

➦ సివిల్ అసిస్టెంట్ సర్జన్/ఆర్ఎంవో(08)/మెడికల్ ఆఫీసర్స్(121)-129

డైటీషియన్-01

➦ బయోమెడికల్ ఇంజినీర్-01

ఫార్మసీ సూపర్‌వైజర్ ఓపీ/ఐపీ- 02

➦ మెడికల్ రికార్డ్ ఆఫీసర్-01

ఫార్మసిస్ట్-12

అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు, ఇతర అర్హతలు నిర్ణయించారు.

వయోపరిమితి: 01-07-2020 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అనుభవం ఆధారంగా.

ముఖ్యమైన తేదీలు..

★ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.06.2020.

★ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 19.06.2020.

Notification

Online Application

Website

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *