Latest News Uncategorized బిజినెస్ న్యూస్

Gold Rate: బంగారం, వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇలా!

గత ట్రేడింగ్‌లో పెరిగిన బంగారం ధరలు బుధవారం దిగొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో.. దేశీయ మార్కెట్‌లోనూ పసిడి ధర తగ్గింది. బంగారంతోపాటు వెండి ధర కూడా కాస్త దిగొచ్చింది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 క్షీణించి రూ.47,750కి చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.100 తగ్గుదలతో రూ.48,950కు క్షీణించింది. ఇక కిలో వెండి ధర రూ.90 తగ్గి.. రూ.52,120 వద్ద కొనసాగుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధర దిగొచ్చింది. బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 క్షీణించింది. దీంతో ధర రూ.51,170కు దిగొచ్చింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.46,910కు క్షీణించింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్‌కు 0.12 శాతం దిగొచ్చింది. దీంతో బంగారం ధర ఔన్స్‌కు 1811 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పైకి కదిలింది. వెండి ధర ఔన్స్‌కు 0.78 శాతం పెరుగుదలతో 19.68 డాలర్లకు చేరింది.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *