Latest News Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

APGS Exams: గ్రామ సచివాలయ పరీక్షలు మళ్లీ వాయిదా!!

ఏపీలో గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలను మరోసారి వాయిదావేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతుండటంతో పరీక్షలను వాయిదా వేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ ఈ మేరకు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పరీక్షల కొత్త షెడ్యూలును త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో 16,208 గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తు చేసుకున్నవారికి పరీక్షల నిర్వహణకు సంబంధించి కసరత్తు చేస్తున్న సమయంలో కరోనా రావడంతో పరీక్షలను వాయిదా వేశారు.

అయితే ఆగస్టు 2వ వారంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. కానీ కరోనా వైరస్ తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో పరీక్షలను మరోసారి వాయిదావేస్తూ నిర్ణయిం తీసుకున్నారు.

ఈ నియామక ప్రక్రియ ద్వారా.. ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న పంచాయతీ సెక్రటరీ, వీఆర్వో, ANM, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరీ కల్చర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-2), పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్-6), డిజిటల్ అసిస్టెంట్ , విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3), వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వంటి పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది.

Read Also: 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *