Latest News Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

పాలిసెట్‌ దరఖాస్తు గడువు పొడిగింపు

పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(పాలిసెట్‌-2020) దరఖాస్తు సమర్పణ గడువును మరోసారి పొడిగించారు. జూలై 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

3500 ప్రాథమిక పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ

సాధారణంగా 1.25 లక్షల వరకు వచ్చే దరఖాస్తులు ఈసారి 70వేలు పైచిలుకు మాత్రమే వచ్చాయి. కరోనా ఉద్ధృతి కారణంగా ప్రస్తుతం ప్రవేశ పరీక్ష నిర్వహించే అవకాశం లేనందున విద్యార్థులకు మరికొంత సమయం ఇచ్చే అవకాశం ఉంది.

ఓపెన్‌ స్కూల్‌ విద్యార్థులకు గుడ్ న్యూస్.. అందరూ ‘పాస్’

మార్చి 16న పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకసారి జూన్‌ 15 వరకు పొడిగించిన రాష్ట్ర సాంకేతిక విద్య-శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాలిసెట్‌ దరఖాస్తు గడువును జూన్ 21 వరకు.. ఆ తర్వాత జూలై 27 వరకు మరోసారి పొడిగించారు.

NIPER JEE 2020 వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే?

దరఖాస్తు దారులు మీసేవ/పేమెంట్‌ గేట్‌వే/నెట్‌ బ్యాంకింగ్‌/ హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ద్వారా రూ.400 ఫీజు చెల్లించాలి.

రాష్ట్రవ్యాప్తంగా 41 సెంటర్లలో పాలిసెట్‌ జరుగుతుంది. పరీక్ష రెండు గంటల పాటు 120 మార్కులకు నిర్వహిస్తారు. 120 ఆబ్జెక్టివ్‌ టైపు ప్రశ్నలు ఇస్తారు. ఫిజిక్స్‌, కెమిస్ర్టీల్లో 30 ప్రశ్నల చొప్పున, గణితంలో 60 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్ష నిర్వహించే తేదీని ఇంకా ప్రకటించలేదు.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *