Uncategorized టెక్నాలజీ

అమెజాన్‌లో యాపిల్‌ ఫోన్లపై బంపర్‌ ఆఫర్లు

అమెజాన్ ఇండియా యాపిల్ డేస్ అమ్మకాల్లో పునరావృత్తిని కొనసాగించడానికి అమెజాన్ ఇండియాలో యాపిల్ డేస్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

వెబ్‌సైట్‌లో ఐఫోన్ 11 సిరీస్‌తో పాటు ఐఫోన్ 8 ప్లస్ వంటి పాత ఫోన్‌లపై ధరలు తగ్గించి విక్రయిస్తోంది. యాపిల్ ఐప్యాడ్ సిరీస్, యాపిల్ వాచ్ సిరీస్‌లతో పాటు విభిన్న ఆఫర్లు ఇందులో ఉంటాయి. జూలై 25 వరకు ఈ సేల్ కొనసాగించనుంది.

ఐ ఫోన్ 11 సిరీస్‌ ప్రారంభ ధర రూ.68,300కు ఉండగా దీన్ని 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో రూ.62,900కు విక్రయిస్తోంది. అంటే రూ.5400 తగ్గింపుతో యాపిల్ డేస్ అమ్మకాల్లో విక్రయిస్తారు.

అమెజాన్ ఐఫోన్ 11 ప్రో రూ.106,600, ఐఫోన్ 11 ప్రో మాక్స్ రూ. 117,100ల ధరల్లో ఎలాంటి తగ్గింపు లేదని తెలిపింది. అయితే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు 4,000 తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది.

ఐఫోన్ 8 ప్లస్ 64 జీబీ ధర యాపిల్ డేస్ అమ్మకం సందర్భంగా రూ.41,500గా ఉంది. మొబైల్‌ ప్రస్తుత ధర రూ. 41,999 ఉండగా 500 వరకు తగ్గింపు లభిస్తుంది.

చాలా వరకు యాపిల్‌ ఫోన్లు ఈఎంఐల ద్వారా, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల ద్వారా అదనపు తగ్గింపు, ఫైనాన్సుల్లో కొనుగోళ్లు జరుపవచ్చని అమెజాన్‌ తెలిపింది.

యాపిల్ డేస్ అమ్మకం సమయంలో యాపిల్ ఐప్యాడ్ సిరీస్‌కు రూ.5000 డిస్కౌంట్‌ లభించనుంది. యాపిల్ వాచ్ సిరీస్3 హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు రూ. 1000 వరకు ఫ్లాట్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది.

హెచ్‌డీఎఫ్‌సీ కార్డుదారులకు యాపిల్ మాక్‌బుక్ ప్రో కొనుగోలుపై రూ.7000 తగ్గింపు ఇవ్వనుంది. ఈ ఆఫర్లు అన్ని అర్థరాత్రి నుంచి అమెజాన్‌ ఇండియాలో ప్రత్యేక పేజీలో లభ్యమవుతాయి.

Read Also:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *