Uncategorized టెక్నాలజీ

Boycott China: ఉఫ్.. వీళ్లు మారరు.. కానరాని ‘చైనా వస్తువుల నిషేధ’ నినాదం.. చైనా ఫోన్లకు ఎగబడుతున్న భారతీయులు.. నిమిషాల్లోనే స్టాక్ ఖాళీ

భారత్-చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. చైనా వస్తువులు నిషేధించాలని నినాదాలు వస్తున్న తరుణంలోనూ చైనా ఫోన్లకు క్రేజ్ తగ్గకపోవడం విడ్డూరంగా ఉంది.

చైనా సంస్థ వన్‌ప్లస్‌ భారత మార్కెట్‌కు తాజాగా తెచ్చిన 8 ప్రో స్మార్ట్‌ఫోన్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అందరూ ఎగబడి మరీ కొనేయడంతో ఆన్‌లైన్‌ అమ్మకాలు మొదలైన నిమిషాల్లోనే స్టాక్‌ అంతా అయిపోయింది.

రెండు వేరియంట్లలో వచ్చిన 8 ప్రో ధరలు రూ.54,999, రూ.59,999గా ఉన్నాయి. నిజానికి గత నెల 29నే ఈ మోడల్‌ ఆన్‌లైన్‌ సేల్‌ మొదలు కావాల్సి ఉన్నది. కానీ కొవిడ్‌-19, లాక్‌డౌన్‌ ప్రభావంతో వాయిదా పడింది.

ఈ క్రమంలోనే గురువారం అమెజాన్‌ ఇండియాతోపాటు వన్‌ప్లస్‌ ఇండియా అధికారిక వెబ్‌సైట్లలో అమ్మకాలను ప్రారంభించారు. అయితే మొదలైన కాసేపటికే ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌ అని వెబ్‌సైట్లలో దర్శనమిచ్చింది.

వన్‌ప్లస్‌ 8 సిరీస్‌ను 5జీ టెక్నాలజీతో పరిచయం చేశారు. కాగా, చైనాకే చెందిన షియామీ, మరో సంస్థ ఇటీవల భారతీయ మార్కెట్‌లోకి తెచ్చిన ల్యాప్‌ట్యాప్‌లకూ ఇదే రీతిలో డిమాండ్‌ కనిపించడం గమనార్హం.

రెండు రోజుల్లోనే నో స్టాక్‌ బోర్డులు కనిపించాయి. ఒకప్పుడు సామ్‌సంగ్‌, యాపిల్‌, నోకియా, సోనీ ఉత్పత్తులకు డిమాండ్‌ ఉన్న దేశీయ మార్కెట్‌లో ఇప్పుడు చైనాకు చెందిన షియామీ, వివో, ఒప్పో, వన్‌ప్లస్‌ హవా నడుస్తున్నది. భారత్ మొబైల్ మార్కెట్‌లో చైనా వాటా 72 శాతంగా ఉంది. భారత్‌ను దొంగదెబ్బ తీసిన చైనాను ఆర్థికంగా దెబ్బతీయాలంటే చైనా వస్తువులను నిషేదించడమే మార్గం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *