Uncategorized పరీక్ష ఫలితాలు

CMAT, GPAT 2020 ఫలితాలు విడుదల

జాతీయస్థాయిలో ఎంబీఏ, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి జనవరి 28న నిర్వహించనున్న ‘కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(సీమ్యాట్‌), గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌(జీప్యాట్‌) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టి్ంగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. పరీక్షలో ఉత్తీర్ణులైన, ఉత్తీర్ణులు కాని అభ్యర్థుల వివరాలను ఎన్టీఏ అందుబాటులో ఉంచింది. అయితే మైనస్‌ మార్కుల కారణంగా జీప్యాట్‌లో 500 మందికిపైగా అభ్యర్థులు సున్నా […]

Uncategorized పరీక్ష ఫలితాలు విద్యా ఉద్యోగ సమాచారం

APPSC: ‘గ్రూప్-2’ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

ఏపీలో ‘గ్రూప్‌-2’ పోస్టుల భర్తీకి సంబంధించి ఆగస్టు 29, 30 తేదీల్లో గతేడాది నిర్వహించిన మెయిన్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఫిబ్రవరి 4న విడుదల చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. 858 మంది ఎంపిక మెయిన్స్ పరీక్ష ఫలితాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో 858 మందితో కూడిన మెరిట్‌ జాబితాను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.

Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా ఉద్యోగ సమాచారం

హైద‌రాబాద్‌ ‘ఐఐటీ’లో 152 ఖాళీలు

హైద‌రాబాద్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..పోస్టుల వివ‌రాలు..* మొత్తం ఖాళీల సంఖ్య: 152➦ రిజిస్ట్రార్ – 01➦ చీఫ్ లైబ్రరీ ఆఫీసర్ – 01➦ డిప్యూటీ రిజిస్ట్రార్ – 02➦ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – […]

Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. ఏపీలో 63 వేల ఉద్యోగాలు.. వార్షిక క్యాలెండర్ ఎప్పుడంటే?

ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరోసారి తీపికబురు వినిపించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 63 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉద్యోగాల సంఖ్య మరో 10 – 15 వేలు పెరిగే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ఖాళీల భర్తీ క్యాలెండర్‌కు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో జ‌న‌వ‌రి 31న‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరగాలని ఆయన […]

Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

సచివాలయ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు

ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు. వాస్తవానికి జ‌న‌వ‌రి 31తోనే దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు వారంరోజుల పాటు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఆయన వెల్లడించారు. గ్రామ సచివాలయాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ (గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి సంబంధించి.. విద్యార్హతలను సడలించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా […]

Uncategorized విద్యా ఉద్యోగ సమాచారం

‘జేఎల్’ పరీక్షల షెడ్యూలు వెల్లడి..

ఏపీలో ఇంటర్మీడియట్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వెల్లడించింది. షెడ్యూలు ప్రకారం ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను ఫిబ్రవరి 5 నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి తమ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షల షెడ్యూలు ఇలా.. ★ ఫిబ్రవరి 17న ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పరీక్ష, మధ్యాహ్నం […]

Uncategorized ప్రభుత్వ ఉద్యోగాలు

వైజాగ్ స్టీల్ ప్లాంటు ఉద్యోగాలు.. ఈ అర్హతలు ఉండాలి

రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలోని విశాఖపట్నం(వైజాగ్) స్టీల్‌ ప్లాంట్.. టెక్నికల్ విభాగంలో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన విద్యార్హతలు ఉన్నవారు నిర్ణీత మొత్తంలో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  […]