Uncategorized ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ విద్యా ఉద్యోగ సమాచారం

ICAI Exams: సీఏ పరీక్షలు వాయిదా.. ఎప్పుడంటే?

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఏఐ) సీఏ పరీక్షలను మరోసారి వాయిదా వేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో.. వాయిదాపడిన పరీక్షలను నవంబరులో నిర్వహిస్తామని తెలిపింది. ఫీజు పేమెంట్స్‌తో పాటు కోర్సు ప‌ర‌మైన రాయితీలు కూడా త‌దుప‌రి అంటెమ్ట్ కు బ‌దిలీ చేయ‌బ‌డ‌తాయ‌ని బోర్డు తెలిపింది. గ్రూప్స్, సెంట‌ర్స్ కూడా మార్చుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది.

ప్రస్తుత విద్యాసంవత్సరంలో మే, నవంబరు నెలల్లో రెండుసార్లు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మే నెలలో జరగాల్సిన పరీక్షలను కరోనా కారణంగా.. జులై 29 నుంచి నిర్వహించనున్నట్లు ఐసీఏఐ ప్రకటించింది. అయితే దేశంలో కరోనా ప్రభావం ఏ మాత్రం తగ్గకపోవడంతో.. జులై పరీక్షలకు హాజరు కాలేమని భావించే విద్యార్థులు వచ్చే నవంబరులో జరిగే రాసుకునేలా వెసులుబాటు కల్పించింది. ఐసీఏఐ తాజా నిర్ణయంతో మే విడత పరీక్షలు రద్దయినట్టయింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. మే 2 నుంచి 18 వరకు చార్టెడ్‌ అకౌంటెంట్స్ ఎగ్జామ్స్ జరగాల్సి ఉంది. అయితే దేశంలో కరోనా లాక్‌డౌన్ విధించ‌డంతో ఐసీఏఐ పరీక్ష‌లు వాయిదా వేసింది. మ‌ళ్లీ జూన్‌ 19 నుంచి జూలై 4 వరకు ప‌రీక్ష‌ల షెడ్యూల్ ప్రకటించింది.

అయితే ప్రస్తుతం కరోనా కేసుల తీవ్రత మ‌రింత పెర‌గ‌డంతో పరీక్షలను మ‌రోసారి వాయిదా వేసి, జూలై 29 నుంచి ఆగస్టు 16 వరకు నిర్వహిస్తామని జూలై 4న ప్రకటించింది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు భారీగా పెర‌గ‌డం, నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో సీఏ ఐసీఏఐ బోర్డు రద్దు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *